Site icon HashtagU Telugu

Year in Search 2023: ఈ సంవత్సరం Googleలో అత్యధికంగా శోధించిన విషయాలు

Year in Search 2023

Year in Search 2023

Year in Search 2023: చూస్తుండగానే సంవత్సరం ముగిసింది. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. అయితే ప్రతి సంవత్సరం ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ పేరుతో ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన విషయాలను గూగుల్ ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం Googleలో అత్యధికంగా శోధించిన విషయాలను తెలుసుకుందాం.

గూగుల్ ప్రతి సంవత్సరం విడుదల చేసే ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2023’ నివేదిక ప్రకారం సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు తదితర అంశాలు ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించాయి.

ఈ ఏడాది ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించిన అంశాల్లో ఇజ్రాయెల్ యుద్ధం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టైటానిక్ జలాంతర్గామి మరియు టర్కీ భూకంపం ఉన్నాయి. అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ డమర్ హామ్లిన్ వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించిన సినిమాల్లో బార్బీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఓపెన్ హైమర్, షారుక్ ఖాన్ జవాన్, సౌండ్ ఆఫ్ ఫ్రీడమ్, జాన్విక్ చాప్టర్-4 ఉన్నాయి.

మన దేశం విషయానికొస్తే.. చంద్రయాన్-3 వార్తా అంశాల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికలు, బడ్జెట్ 2023, ఒడిశా రైలు ప్రమాదం వంటి అంశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మన దేశంలో G20 సదస్సు, యూనిఫాం సివిల్ కోడ్, చాట్ GPT, హమాస్ మొదలైనవి ఉన్నాయి. జుట్టు మరియు చర్మాన్ని ఎలా రక్షించాలి అని చాలా మంది వెతికారు. అలాగే యూట్యూబ్‌లో ఐదు వేల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందడం ఎలా?, కబడ్డీ ఆడటం ఎలా?, కార్ మైలేజీని పెంచడం ఎలా?, చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా మారడం ఎలా? అనే అంశాలపై చాలా పరిశోధనలు జరిగాయి.

స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మన దేశంలో అత్యధికంగా గూగుల్ చేసిన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ మొదటి స్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో క్రికెటర్ శుభమన్ గిల్ ఉన్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర, భారత బౌలర్‌ మహ్మద్‌ షమీ, ఆసీస్‌ క్రికెటర్‌ మాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌, భారత బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్నారు.

పర్యాటక ప్రాంతాల విషయానికొస్తే.. ఈ ఏడాది భారతీయులు వియత్నాం గురించే ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత గోవా, ఇండోనేషియాలోని బాలి, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి ప్రదేశాలు ఉన్నాయి.

Also Read: Harish Rao: తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది: హరీశ్ రావు