Women & Men: పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు.. ఎందుకో తెలుసా..!

హార్వర్డ్ నిపుణుల యొక్క విశ్లేషణ ప్రకారం.. మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Women Live Longer than Men : పురుషుల కంటే మహిళలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తారు ? అనే దానికి హార్వర్డ్ మెడికల్ శాస్త్రవేత్తలు కారణాన్ని కనుగొన్నారు. మహిళల్లో మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్‌కు 60.3 మిల్లీ గ్రాములు ఉంటే పురుషుల్లో ఇది 48.5 మాత్రమే. ఇక పురుషులలోని Y క్రోమోజోమ్ అనేది వారికి వచ్చే వ్యాధులతో ముడిపడి ఉంటుంది . అందుకే పురుషులకు మహిళల కంటే త్వరగా మరణించే ముప్పు ఉంటుంది. పురుషులు, మహిళలు ప్రతి అంశంలో భిన్నంగా ఉంటారని మనందరికీ తెలుసు.

స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ కండరాలు ఉన్నందున వారు స్త్రీల కంటే వేగంగా పరిగెత్తగలరు. ఎక్కువ బరువును ఎత్తగలరు. అయితే పురుషులు, స్త్రీల కంటే తక్కువగా జీవిస్తారని.. వారికి మహిళల కంటే ఎక్కువ వ్యాధులు వస్తాయని మీకు తెలుసా? దీనిపై ఇటీవల హార్వర్డ్ మెడికల్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలు చేసి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారని తేల్చారు. హార్వర్డ్ నిపుణుల యొక్క విశ్లేషణ ప్రకారం.. మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీన్ హార్వర్డ్ మెడికల్ వెబ్‌సైట్ ప్రకారం.. తల్లి కడుపులో పిండం దశ నుంచే స్త్రీ, పురుషులు వేరు చేయబడతారు. ఇద్దరికి 23 జతల చొప్పున క్రోమోజోమ్‌లు ఉంటాయి. 22 జతల క్రోమోజోములు స్త్రీ, పురుషుల్లో ఒకేలా ఉంటాయి. కానీ 23వ జత మాత్రం ఇద్దరిలో వేర్వేరుగా ఉంటుంది.  మగవారికి 23వ జతలో ఒక X మరియు ఒక Y క్రోమోజోమ్ ఉండగా.. ఆడవారికి 23వ జతలో రెండు X క్రోమో జోమ్‌లు ఉంటాయి.Y క్రోమోజోమ్, X క్రోమోజోమ్ కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుంది. అది X కంటే తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. అతిపెద్ద విషయం ఏమిటంటే.. పురుషులలో కొన్ని Y క్రోమోజోమ్‌లు వ్యాధులతో ముడిపడి ఉంటాయి. పురుషులకు మరణాల ప్రమాదం మహిళల (Women) కంటే ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం అని శాస్త్రవేత్తలు తెలిపారు.

హార్మోన్లు..

పురుషుల్లోని టెస్టోస్టెరాన్ హార్మోన్ కాలక్రమేణా గుండె కండరాలను జల్లెడ పట్టడం ప్రారంభిస్తుంది. మరియు అనేక రకాల గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇక మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్, గుండెను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అధ్యయనాల ప్రకారం, మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయి.

పునరుత్పత్తి అవయవం..

మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి అనేక సమస్యలకు కారణం అవుతుంది. అయితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కేసులను చూస్తుంటే.. ఈ విషయంలో పురుషులు ఎంతో సురక్షితంగా ఉన్నారని అనిపిస్తుంది. కానీ రిపోర్టుల ప్రకారం మహిళల కంటే పురుషులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.

జీవక్రియ..

ఆసక్తికరంగా..గుండెను రక్షించే మంచి కొలెస్ట్రాల్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.  స్త్రీలలో మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్‌కు 60.3 మిల్లీగ్రాములు కాగా.. పురుషులలో ఇది 48.5 మాత్రమే. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీవక్రియ కూడా చురుకుగా ఉంటుంది.

సామాజిక ఆచరణాత్మక అంశం..

స్త్రీల ఆహారం పురుషుల కంటే ఆరోగ్యకరమైనదిగా పరిగణించ బడుతుంది. మహిళలు ఎక్కువగా ఇంటిపని చేస్తారు. దీనివల్ల వారి శారీరక వ్యాయామం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి, పురుషుల కంటే స్త్రీలు వైద్యపరంగా బలంగా పరిగణించబడతారు.

Also Read:  WhatsApp Disappearing Messages: వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ కోసం 15 కొత్త టైమింగ్స్