Site icon HashtagU Telugu

Women : స్త్రీలు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.. ఆంటీలు కూడా అమ్మాయిల్లా కనిపించాల్సిందే..

Women Just Follow These Small Tips.. Aunties Should Also Look Like Girls..

Women Just Follow These Small Tips.. Aunties Should Also Look Like Girls..

Tips for Women Beauty : మామూలుగా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అందంగా యవ్వనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఇతర అమ్మాయిల కంటే తానే అందంగా కనిపించాలి తానే అందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అందుకే కొంతమంది అమ్మాయిలు (Women) 30, 40 ఏళ్లు వచ్చినా కూడా 25 ఏళ్ల యువత లాగే కనిపిస్తూ ఉంటారు. ఇందుకు బెస్ట్ ఉదాహరణగా హీరోయిన్స్ ని తీసుకోవచ్చు. అయితే మామూలుగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు మచ్చలు చర్మం కాంతివంతంగా లేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join.

మరీ ముఖ్యంగా స్త్రీలు (Women) 40 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కనిపించాలి అంటే కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చర్మం అందంగా మెరవాలంటే పెరుగును ప్రతిరోజు తినాలి. పెరుగులో ఉంటే ప్రోబయోటిక్స్ శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. శరీర రంద్రాలను నింపుతుంది. పెరుగులో ఉండే విటమిన్ బి12 చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే పచ్చని ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్ ను పెంచుతుంది. ఇది వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే బొప్పాయి ప్రతిరోజు తినాలి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడుతాయి.

అలాగే దానిమ్మలో పునికాలాగిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే చర్మం ఎక్కువకాలం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజు దానిమ్మలు తినాలి. క్యాబేజీ లో బలమైన ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను నివారిస్తుంది. దీంతో చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. క్యాబేజీని సలాడ్ లేదా తేలికగా ఉడకబెట్టి తీసుకోవచ్చు.

Also Read:  Pooja Niyamalu: భర్త లేనటువంటి స్త్రీలు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు.. కుంకుమ ధరించవచ్చా?