Site icon HashtagU Telugu

‎Winter: చలికాలం పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ స్నానంలో ఈ మార్పులు చేయాల్సిందే?

Winter

Winter

Winter: చలికాలంలో వచ్చింది అంటే చాలు అనేక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. వాటిలో జుట్టుకు సంబంధించిన సమస్యలతో పాటు చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొడి చర్మం కారణంగా దురద పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి అప్పుడు కొన్ని తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు. మరి చలికాలంలో పొడి చర్మం దురద వంటి సమస్యలు ఉండకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎చల్లటి వాతావరణంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆనందం తాత్కాలికం మాత్రమే అని చెబుతున్నారు. అతివేడి నీరు చర్మంపై ఉండే సహజ నూనెలను పూర్తిగా కరిగించి, తొలగిస్తుందట. దీనివల్ల చర్మం మరింత పొడిగా, నిర్జీవంగా మారి దురద సమస్య రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. అందుకే స్నానానికి ఎప్పుడూ అతివేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలట. ఇది మీ చర్మం సహజ నూనెల పొరను కాపాడి, దురదను అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. స్నానం చేసిన తర్వాత మన చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. కానీ టవల్ లేదా కండువాతో తుడుచుకున్న కొద్దిసేపటికే మళ్లీ పొడిబారిపోతుంది.

‎ఇక్కడే మనం అసలైన ఉపాయాన్ని ప్రయోగించాలట. స్నానం చేసిన వెంటనే చర్మం ఇంకా కొద్దిగా తేమగా ఉన్నప్పుడే మంచి మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్ రాయాలని చెబుతున్నారు. ఇది చర్మంపై ఒక పొరలా ఏర్పడి, స్నానం వల్ల అందిన తేమను బయటకు పోకుండా బంధిస్తుందట. అయితే ఇందుకోసం మీరు సహజసిద్ధమైన కొబ్బరి నూనె, బాదం నూనె వంటివి కూడా వాడవచ్చని చెబుతున్నారు. ఇది చర్మానికి పోషణను ఇచ్చి రోజంతా మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుందట. పొడిబారడం, దురద వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులను వేసి మరిగించి, ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందట. గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌ లా చేసి దురద ఉన్న చోట రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ముల్తానీ మిట్టిని నీటితో కలిపి చర్మానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలట. ఇది చర్మాన్ని శుభ్రపరిచి దురదను తగ్గిస్తుందని చెబుతున్నారు.

Exit mobile version