Site icon HashtagU Telugu

Hair Tips: చలికాలంలో మీ జుట్టు పొడిబారుతోందా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే?

Mixcollage 14 Dec 2023 03 36 Pm 6978

Mixcollage 14 Dec 2023 03 36 Pm 6978

మామూలుగా చాలా మందికి చలికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జుట్టు నిర్జీవంగా పొడిబారిపోయినట్టు అయిపోయి గడ్డిలా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా బయట చల్లగాలులకు తిరగడం వల్ల జుట్టు డల్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాంటి సమయంలో చాలామంది మార్కెట్లో దొరికే రకాల షాంపులు వినియోగిస్తూ ఉంటారు. వీటికోసం కొందరు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కాలతో ఎటువంటి డబ్బులు లేకుండా ఖర్చులు పెట్టకుండా సింపుల్ చిట్కాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు.

మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేనె, ఆలీవ్ నూనె, బొప్పాయి కొంచెం బియ్యం కలిపి మెత్తటి పేస్టులా చేసి జుట్టుకి పెట్టుకుంటే శీతాకాలంలో జుట్టు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. షాంపూ చేసుకునే 20 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకొని తలస్నానం చేయాలి. ఇది జుట్టుని మృదువుగా, నునుపుగా చేస్తుంది. అలాగే కొన్ని రోజ్ వాటర్ తో మీ జుట్టుని మసాజ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది పొడి జుట్టు సమస్య నుండి బయట పడేస్తుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆహార నియమాలు పాటించకపోతే పెద్దగా రిజల్ట్ ఉండదు. కావున ఎక్కువగా నీరు తాగడం అలాగే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

అలాగే ఈ సీజన్లో దొరికే పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే చలికాలంలో ప్రతిరోజు నూనెతో కొద్దిసేపు మీ తలని మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. ఈ విధంగా చేయడం వలన జుట్టులో తేమ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా తలస్నానం చేసే ముందు కచ్చితంగా జుట్టు స్కాల్పుని మసాజ్ చేయాలి. శికాయ, ఉసిరి ముల్తాని మట్టిని సమపాల్లో తీసుకొని మిక్సీ పట్టి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకి కండిషన్ ర్ లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది.