Site icon HashtagU Telugu

Hair Tips: చుండ్రు, జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా తలస్నానం చేయాల్సిందే?

Mixcollage 22 Jan 2024 06 23 Pm 8977

Mixcollage 22 Jan 2024 06 23 Pm 8977

ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాలడం చుండ్రు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడంతో పాటు అనేక రకాల హోమ్ రెమిడిలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో చాలా మంది తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనె తగ్గి స్కాల్ప్ డ్రైగా మారుతుంది. కాబట్టి, చలికాలంలో జుట్టుని వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే క్లీన్ చేయాలి.

అయితే, తలస్నానానికి ముందు కచ్చితంగా నూనె రాయాలి. అయితే, నూనె రాశాక చాలా మంది ఎక్కువ టైమ్ అలానే ఉంటారు. ఇలా చేస్తే తలలో మురికి పేరుకుపోతుంది. దురద, చుండ్రు వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే హెయిర్ ఆయిల్ రాసిన 2 గంటల తర్వాత ఒక రాత్రంతా ఉంచి నెక్స్ట్ డే కచ్చితంగా తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు షైనీ, బలంగా ఉంటుంది. తలస్నానానికి వాడే నీటి టెంపరేచర్ కూడా చాలా ముఖ్యం. మీరు మీ జుట్టుని క్లీన్ చేసేందుకు ఎక్కువగా వేడినీటిని వాడ కూడదు. అది మీ స్కాల్ప్‌ని ఎక్కువగా పొడి చేస్తుంది. జుట్టు నిర్జీవంగా మారుతుంది. కాబట్టి, కేవలం గోరువెచ్చని నీరు అయితే సరిపోతుంది.

అలాగే ఎక్కువగా గాఢత ఉన్న షాంపూ వాడకూడదు. దీని వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇది తల దురద, చుండ్రుకి కారణమవుతుంది. కాబట్టి, చలికాలంలో మైల్ షాంపూ వాడడం మంచిది. అదే విధంగా జుట్టుకి నేచురల్ కండీషనర్ వాడడం మంచిది. దీని వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది. అయితే, మీరు సరిగ్గా వాడాలి. చలికాలంలో జుట్టు సరిగ్గా ఉండాలంటే నేచురల్ కండీషనర్స్ వాడొచ్చు. దీని వల్ల సహజంగా షైనీగా ఉంటుంది. జుట్టు హెల్దీగా ఉంటుంది.