Site icon HashtagU Telugu

Coconut Milk: పసి పిల్లలు కొబ్బరి పాలు తాగొచ్చా? తాగితే ఏం జరుగుతుంది?

Coconut Milk

Coconut Milk

కొబ్బరి పాలలో ఎన్నో రకాలు పోషకాలు ఉంటాయి. చాలామంది కొబ్బరిని ఇష్టపడి తింటే మరి కొంతమంది కొబ్బరిపాలను ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఈ కొబ్బరి పాలను పెద్దలు కాకుండా చిన్న పిల్లలకు ఇవ్వవచ్చా లేదా అన్న ప్రశ్న చాలా మందికి తలెత్తి ఉంటుంది. అంతే కాకుండా చిన్నపిల్లలకు తల్లిపాలకు బదులుగా కొబ్బరి పాలను వాడటం మంచిది కాదు. కొబ్బరి పాలను ఆహారంలో కొంచెం మొత్తంలో జోడించవచ్చు. అలాగే 12 నెలల కంటె ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు కాల్షియం ఫోర్టిపైడ్ కొబ్బరి పాలను ఇవ్వవచ్చు. ఆహారంలో పాలను జోడిస్తే మంచిది.

ఆరు నెలలు దాటిన చిన్నారులకు కొబ్బరి పాలతో తయారు చేసిన చీజ్,పెరుగు వంటివి తినిపించడానికి ప్రయత్నించవచ్చు. అంతకంటే ముందుగా డాక్టర్ ని సంప్రదించడం మేలు. కొబ్బరికాయ సైజును బట్టి అందులో పాలలోని పోషకాలు ఉంటాయి. కొబ్బరి పాలలో విటమిన్ డి క్యాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. 30 గ్రాముల పాలల్లో కాల్షియం, విటమిన్ఎ,బి 12, డి ఉంటాయి. కొబ్బరి పాలలో కాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాచ్యురేటెడ్ ఫ్యాట్ మినరల్స్ ఉండటం వల్ల పిల్లలకు మేలు కలుగుతుంది.

ఇవి పిల్లలు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. అలాగే కొబ్బరిపాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇక వీటిలోని అత్యధిక వాటర్ కంటెంట్ బయో యాక్టివ్ కాంపౌండ్లు పొట్ట పనితీరును చక్కబరుస్తాయి. అలాగే కొబ్బరి పాలలోని పోషకాలు రోగ నిరోధక శక్తికి మేలు చేస్తాయి. ఇక వీటిలోని బయో యాక్టివ్ కాంపౌండ్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.

Exit mobile version