Site icon HashtagU Telugu

Wife-Husband 7 Arrests : భర్తను ఆడుకున్న భార్య..7 సార్లు జైలు..7 సార్లు బెయిలు!!

Wife Husband 7 Arrests

Wife Husband 7 Arrests

Wife-Husband 7 Arrests : ఓ మహిళ తన భర్తను గత 10 ఏళ్లలో ఏడుసార్లు అరెస్టు చేయించింది.. 

ప్రతిసారి భర్త వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేయడం .. పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగిపోయింది..   

నాలుగు పదుల వయసులో ఉన్న గుజరాత్ లోని పటాన్‌కు చెందిన ప్రేమ్‌చంద్ మాలీ, సోను మాలీ  దంపతుల రియల్ స్టోరీ ఇది.. 

2001లో ప్రేమ్‌చంద్ మాలీ, సోను మాలీల పెళ్లి జరిగింది. వీరి వివాహ  జీవితం మొదట్లో చాలా ప్రశాంతంగా ఉండేది. 2014లో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సోనూ తన భర్త  ప్రేమ్‌చంద్‌పై 2015లో గృహహింస కేసు పెట్టింది. దీంతో ఆమెకు నెలకు రూ. 2,000 భరణం చెల్లించాలని కోర్టు ప్రేమ్‌చంద్‌ ను  ఆదేశించింది. అయితే ప్రేమ్‌చంద్ 2015లో తన భార్యకు భరణం (నెలకు రూ.2000) చెల్లించేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆమె మళ్ళీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి ఐదు నెలల పాటు జైలు లో గడిపాడు. ఈ టైంలో భార్య  సోనూ  వెళ్లి గ్యారెంటర్‌గా సంతకం చేసి.. అతడికి బెయిల్ ఇప్పించింది. చట్టబద్ధంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ.. ఇక ఈ జంట కలిసి జీవించడం కొనసాగించింది. ఈక్రమంలో మళ్ళీ వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి.  ఆ తర్వాత 2016 నుంచి 2018 మధ్యకాలంలో  ప్రతి సంవత్సరం తనపై దాడి చేశాడంటూ ఆమె తన భర్త ప్రేమ్‌చంద్‌  పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేది. దీంతో పోలీసులు వచ్చి అరెస్టు(Wife-Husband 7 Arrests) చేశారు. ఈక్రమంలో మళ్ళీ  ప్రతిసారీ భార్య సోను జోక్యం చేసుకుని ప్రేమ్‌చంద్‌ కు బెయిల్‌ వచ్చే ఏర్పాట్లు చేసేది.

Also read : Brij Bhushan Misbehav: మహిళ జర్నలిస్టుపై బ్రిజ్ భూషణ్ దురుసు ప్రవర్తన.. ఫైర్ అయిన షర్మిల

ఆ తర్వాత  2019, 2020 సంవత్సరాల్లో కూడా  ప్రేమ్‌చంద్ తన భార్యకు భరణం చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ఇంకో రెండుసార్లు ప్రేమ్‌చంద్‌ కు జైలు శిక్ష పడింది. ఈ టైంలోనూ భార్య సోనూ ఎంట్రీ ఇచ్చి.. అతడికి బెయిల్ ఇప్పించి ఆడుకుంది.  వాళ్లిద్దరూ కలిసి.. అల్లకల్లోలమైన తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ  మొదలుపెట్టారు. ఈ ఏడాది (2023 ) ప్రారంభంలో ప్రేమ్‌చంద్ తన భార్యకు భరణం చెల్లించలేదు. దీంతో ఇంకోసారి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. భార్య సోను మరోసారి వెళ్లి ఈనెల (జూలై) 4న భర్త ప్రేమ్‌చంద్ ను బెయిల్ పై విడిపించింది. వారిద్దరూ తమ ఇంటికి తిరిగొచ్చారు. జూలై 5న ప్రేమ్‌చంద్ తన పర్సు, సెల్‌ఫోన్ మిస్సయ్యాయని గుర్తించాడు. దీనిపై భార్య సోనుని ప్రశ్నించగా.. ఆ వస్తువులు ఎక్కడున్నాయో తనకు తెలియదని పేర్కొంది. దీనిపై మాట మాట పెరిగి .. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరకు 20 ఏళ్ల వయసున్న  కుమారుడు రవి కూడా ప్రేమ్‌చంద్‌పై బ్యాట్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత ప్రేమ్‌చంద్ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. జులై 7న  భార్య సోను తన కళ్లలో ఎర్ర కారం చల్లి కొట్టిందని పేర్కొన్నాడు. ఈ వరుస ఘటనలతో విసుగు చెందిన ప్రేమ్‌చంద్ తన భార్య, కొడుకును వదిలేసి.. తన తల్లి ఇంటికి వెళ్లి ఉంటున్నాడు.