Start Your Day With Banana: టీ, కాఫీతో కాదు.. బనానాతో డే స్టార్ట్ చేయండి..!

ఉదయం నిద్ర లేవగానే మీరు మొదట తింటారా ? తాగుతారా? చాలామంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు మీరు ఉదయాన్నే తీసుకునే ఫుడ్ కావలసినంత శక్తిని ఇచ్చేదిగా ఉండాలని చెబుతారు. ఒక గ్లాసు నీరు తాగాక.. కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అంటారు.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 05:00 PM IST

ఉదయం నిద్ర లేవగానే మీరు మొదట తింటారా ? తాగుతారా? చాలామంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు మీరు ఉదయాన్నే తీసుకునే ఫుడ్ కావలసినంత శక్తిని ఇచ్చేదిగా ఉండాలని చెబుతారు. ఒక గ్లాసు నీరు తాగాక.. కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అంటారు. ఈవిధమైన టిఫిన్ మిమ్మల్ని తీపి పదార్థాలు తినాలనే కోరిక నుంచి దూరంగా ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలా కాకుండా.. మీరు టీ లేదా కాఫీతో మీ రోజును ప్రారంభిస్తున్నట్లయితే.. కరీనా కపూర్, అలియా భట్ , కంగనా రనౌత్ వంటి ప్రముఖులకు డైట్ గైడ్ చేసిన పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ మీ ఆరోగ్యానికి మంచి టిప్స్ చెబుతున్నారు.  ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. టీ లేదా కాఫీకి బదులుగా అరటిపండు లేదా నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన ఎండుద్రాక్షతో మీ రోజును ప్రారంభించడం గురించి చక్కగా వివరించారు.

అరటిపండును తినలేకపోతే

రుజుతా దివేకర్ ఏం చెప్పారంటే.. “మీరు జీర్ణక్రియ, గ్యాస్, ఉబ్బరంతో పోరాడుతున్నట్లయితే .. మలబద్ధకం ఉంటే.. మీ రోజును అరటిపండుతో ప్రారంభించండి. మీరు అరటిపండును తినలేకపోతే స్థానిక , సీజనల్ ఫ్రూట్స్ ను తినండి” అని చెప్పారు.”అరటి పండ్లు కొన్నాక ప్లాస్టిక్ సంచుల్లో ఇంటికి తీసుకురాకండి. దానికి బదులుగా ఒక గుడ్డ సంచిని ఉపయోగించండి” అని ఆమె తెలిపారు.

నానబెట్టిన ఎండుద్రాక్ష

“రోజూ 6-7 నానబెట్టిన ఎండుద్రాక్షలు తినడం మంచిది. మీరు భయంకరమైన PMS లేదా రోజంతా తక్కువ శక్తితో ఉన్న వ్యక్తిగా రేట్ చేసుకున్నట్లయితే ఎండుద్రాక్షలు బెస్ట్ ఛాయిస్. ” అని ఆమె రాసింది.ఈ పోస్ట్‌ని రుజుతా దివేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
బ్రౌన్ రైసిన్‌లతో కాకుండా నల్ల ఎండు ద్రాక్షను మార్నింగ్ టైంలో తినాలని దివేకర్ అన్నారు. నలుపు రంగువి అందుబాటులో లేకుంటే గోధుమ రంగు ఎండుద్రాక్షలు కూడా ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.ఎండుద్రాక్షను నానబెట్టిన నీటిని కూడా తాగొచ్చని చెప్పారు.  లో హిమోగ్లోబిన్, రొమ్ము సున్నితత్వం, గ్యాస్, చిరాకు, మానసిక కల్లోలం లేదా PCOD (పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్) సమస్యలను ఇది తొలగిస్తుంది.

నానబెట్టిన బాదం

“టీ, కాఫీలకు బదులు నానబెట్టిన బాదం ను ఉదయాన్నే తింటే బెస్ట్. రోజూ ఉదయాన్నే 4-5 నానబెట్టి , ఒలిచిన బాదం తినాలి. ఇందుకోసం మమ్రా లేదా స్థానిక రకాలైన బాదామ్‌ను ఎంచుకోండి. ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది” అని దివేకర్ రాశారు. ఇవి తిన్న తర్వాత 10-15 నిమిషాలకు చాయ్ (టీ) లేదా కాఫీ తాగడం సరైందన్నారు.