ఆషాఢమాసం రాగానే ఆడపిల్లలు చేతికి గోరింటాకు(Gorintaku) పెట్టుకుంటారు. అదేవిధంగా ఆషాడం రాగానే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. గోరింటాకు(Mehndi) అంటే గౌరీ ఇంట ఆకు అని అర్ధం. పూర్వం గోరింటాకు చెట్టు మీద ఒక కథ ఉంది. పర్వతరాజు కుమార్తె అయిన గౌరీ దేవి రజస్వల అయినప్పుడు నేల పైన ఒక రక్తపు చుక్క పడింది. అక్కడే ఈ గోరింటాకు చెట్టు పుట్టింది. అయితే గౌరీ దేవి ఆడుకుంటూ ఆ చెట్టు ఆకుతో ఆడితే ఆమె చేయి ఎర్రబడింది. కానీ ఎటువంటి నొప్పి కలగలేదు అదే విషయం ఆమె తన తండ్రితో చెప్పి ఈ చెట్టు అలంకారప్రాయంగా బాగుంది అని చెప్పింది.
పర్వతరాజు అప్పుడు ఆ చెట్టుకు నువ్వు పార్వతి వలన పుట్టావు కనుక నీ ఆకును పెట్టుకున్న వారికి అనారోగ్య సమస్యలు రావు అని అంటారు. ఆషాడం అంటే అప్పుడే సీజన్ మారుతుంది, వర్షాకాలం వస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్స్, వర్షాకాలం వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది గోరింటాకు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి.
గోరింటాకు పెట్టుకున్న వారికి గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. హార్మోన్స్ పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది. చర్మం కూడా సున్నితంగా తయారయ్యేలా చేస్తుంది. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వలన వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి. గోర్లు పుచ్చిపోకుండా, కాళ్ళకు పగుళ్లు వంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది. అందుకే మన పూర్వీకులు గోరింటాకుని ఆషాడంలో కచ్చితంగా పెట్టుకోమని చెప్తారు. గోరింటాకు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
Also Read : Papaya Benefits For Skin: బొప్పాయితో ఇలా చేస్తే చాలు.. ముఖం మెరిసిపోవాల్సిందే?