Danger Heels: ప్రెగ్నెన్సీ టైంలో హై హీల్స్ ధరిస్తే.. యమ డేంజర్.. బీ అలర్ట్!!

ఫ్యాషనబుల్ గా ఉండే హైహీల్స్‌ చెప్పులు వేసుకోవడం అనేది ప్రకృతి విరుద్ధం.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 07:45 AM IST

ఫ్యాషనబుల్ గా ఉండే హైహీల్స్‌ చెప్పులు వేసుకోవడం అనేది ప్రకృతి విరుద్ధం. వీటిని ధరించడం వల్ల కాళ్ల నొప్పులు సహా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా గర్భిణులు హై హీల్స్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులు చదునుగా ఉండే చెప్పులు వేసుకోవడం బెస్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండనే ఉండవు.

హై హీల్స్ వేసుకోవడం వల్ల గర్భిణుల్లో తలెత్తే సమస్యలు..

* ఎత్తు మడమల చెప్పులు వాడితే, నడుము ముందుకి వంగిపోతుంది. దాంతో శరీరాకృతీ దెబ్బ తింటుంది. అండాశయ సమస్యలూ తలెత్తుతాయి. ఎండోమెట్రియాసిస్‌ కూడా రావొచ్చు.

* ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల పొత్తికడుపు, నడుము, పాదాల్లో నరాల పనితీరు దెబ్బ తింటుంది. పాదాలను ఇబ్బంది పెట్టే ఎత్తు మడమల చెప్పులు వాడడం వల్ల పాదాల ఆకారం, తద్వారా నడక దెబ్బ తింటుంది. గర్భసంచి స్థానభ్రంశం చెంది.. కిందకి జారే ప్రమాదమూ ఉంటుంది. దాంతో భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలూ తలెత్తవచ్చు. హై హీల్స్‌ వేసుకోవడం వల్ల నడుము పైభాగం ముందుకు వంగి వెన్ను సమస్యలూ రావొచ్చు.

* హైహీల్స్ వేసుకోవడం వల్ల పాదాల నొప్పితో పాటు మోకాళ్ల నొప్పుల సమస్య కూడా వస్తుంది. ఇది కాకుండా అనేక రకాల సమస్యలు సంభవించవచే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. గంటల తరబడి హైహీల్స్ ధరించడం వల్ల పాదాల్లో నొప్పి సమస్య రావచ్చు. వాస్తవానికి హైహీల్స్ ధరించడం వల్ల కండరాలపై ఒత్తిడి కలుగుతుంది. దీని కారణంగా పాదాల నొప్పితో పాటు చీలమండలు, నడుము, తుంటిలో నొప్పి ఉంటుంది.

* హైహీల్స్ ధరించడం వల్ల వెన్నెముక ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఇది మోకాళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు చాలా రోజులు లేదా గంటలు తరబడి నిరంతరంగా హై హీల్స్ ధరిస్తే.. దీని కారణంగా మోకాలి నొప్పి సమస్య వస్తుంది.

* ఎముకలు విరిగిపోయే ప్రమాదం: హైహీల్స్ ధరించడం వల్ల కూడా ఫ్రాక్చర్లు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల కాళ్లు, నడుము, తుంటి ఎముకలు విరిగిపోతాయి. ఇది కాకుండా శరీర భంగిమ కూడా చెడుగా ఉంటుంది. కావున, ఎముకలు బలహీనంగా ఉంటే హైహీల్స్ ధరించేముందు ఆలోచించాలని సూచిస్తున్నారు

* ముని వేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలిగిపోవడం, పాదాలు దెబ్బతినడం గోళ్ల ఇన్ ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్స్ అంటున్నారు. 3. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్‌గా ఉన్న చెప్పులు వాడటమే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎత్తై చెప్పులు ఆరోగ్యానికే కాదు, నడకకు కూడా సౌకర్యవంతంగా ఉండవు. పెన్సిల్ హీల్ వంటి వాటితో జారిపడి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ. దీంతో ఆడవాళ్ళు 40 సంవత్సరాలు కూడా రాకముందే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారట. దీనికి కారణం ఎత్తుచెప్పులు వాడటమే. కాబట్టి ఎత్తు చెప్పులను కొని అనారోగ్యాల పాలు కావడం కంటే, ప్లాట్ చెప్పులు వేసుకొని ఆరోగ్యంగా ఉండడమే మంచిది.

ఏ చెప్పులు మేలు?

చదునుగా ఉండే చెప్పులు వేసుకుంటే పాదాలు నేల మీద సమాంతరంగా ఆని, శరీర బరువు రెండు పాదాల మీద సమానంగా పడుతుంది. దాంతో నడుమూ, వెన్నూ నిటారుగా ఉంటాయి. శరీరాకృతీ చక్కగా ఉంటుంది.
వంటింట్లో పనిచేసేటపుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలి. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పై ఎక్కి పనిచేయ్యద్దు. మెట్లు ఎక్కిదిగేటపుడు జాగ్రత్తగా వుండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపాటు పనికిరాదు.