మనం ఎన్నో కలలు కంటూ ఉంటాము కొత్త ఇంటి గురించి అలా కలలు కని కట్టుకున్న కొత్త ఇంటిలోనికి గృహప్రవేశం చేసేటప్పుడు అందరూ పాలు పొంగించి(Spilling Boiling Milk) సత్యనారాయణ వ్రతం జరుపుకొని నైవేద్యం సమర్పించి తమకు తోచినంత వరకు భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనం ఇల్లు(House) మారినప్పుడు కూడా పాలు పొంగిస్తూ ఉంటాము. కానీ చాలా మందికి కొత్త ఇంటిలోనికి వెళ్లినా లేదా ఇల్లు మారినప్పుడు పాలు ఎందుకు పొంగిస్తామో ఆ విషయం గురించి ఎవరికీ తెలియదు.
మన అందరికీ తెలిసిన విషయం హిందూ పురాణాల ప్రకారం సముద్ర గర్భం నుండి రాక్షసులు, దేవతలు క్షీర సాగర మధనం చేసినపుడు లక్ష్మీదేవి ఉద్బవించింది. లక్ష్మీదేవి పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తితో ఉంటుంది. కాబట్టి మనం ఇంటిలో పాలు పొంగిస్తే మన ఇంటిలోనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వస్తారని నమ్మకం. వారి కటాక్షం ఆ ఇంటి యజమానికి లభిస్తుందని నమ్మకం. పాలు కొత్త ఇంటిలో పొంగించడం వలన ఆ ఇంటిలో ఐశ్వర్యం రావడంతో పాటు అన్ని మంచే జరుగుతాయని నమ్మకం.
కాబట్టి కొత్త ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అందరూ ముందుగా పాలు పొంగిస్తారు. తరువాత వ్రతం చేసుకుంటారు. అలాగే ఇల్లు మారినప్పుడు కూడా అందరూ పాలు పొంగిస్తారు. పాలు పొంగించడం వలన మన ఇంటిలో ధనం, సంతానం, ఆరోగ్యం ఉంటుంది. ఏ విధంగా అయితే మన ఇంటిలో పాలు పొంగుతాయో అదేవిధంగా మన ఇల్లు సంతోషంతో ఉప్పొంగాలని అంతా భావిస్తారు.
Also Read : Beerakaya Nuvvula Pachadi: ఎంతో రుచిగా ఉండే బీరకాయ నువ్వుల పచ్చడి.. టేస్ట్ అదుర్స్?