Spicy Food in Rain : వర్షాకాలంలో పకోడీలు, బజ్జిలు తినాలని ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?

వర్షాకాలం(Rainy Season)లో పకోడీలు, సమోసాలు, బజ్జీలు వంటివి తినాలనిపిస్తుంది. కానీ అవి మన ఆరోగ్యానికి మంచివి కావు.

Published By: HashtagU Telugu Desk
Why spicy food want to eat in Rainy Season

Why spicy food want to eat in Rainy Season

వేసవి(Summer)లో చల్లని కూల్ డ్రింక్స్, జ్యూస్ లు, వర్షాకాలం(Rainy Season)లో పకోడీలు, సమోసాలు, బజ్జీలు వంటివి తినాలనిపిస్తుంది. కానీ అవి మన ఆరోగ్యానికి మంచివి కావు. వర్షాకాలంలో బయట ఫుడ్ తిన్నా లేదా నీరు బయటవి తాగినా హెల్త్ సమస్యలు వస్తాయి. కానీ మనకు బయట ఫుడ్ మంచిది కాదు అని తెలిసినా బయటవి తినకుండా ఉండలేము.

మన శరీరంలో వర్షాకాలంలో సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో సూర్యరశ్మి లేకుండా ఉండడం వలన మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి మన శరీరం కార్బోహైడ్రాట్స్ కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రాట్లు మన శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారపదార్థాలలో తేమ తక్కువగా ఉండి అవి పొడిగా ఉంటాయి. ఇవి తినడం వలన మనకు చెమటలు పడతాయి. మన నోటికి రుచికరంగా ఉంటాయి. అందుకే మన శరీరం వర్షాకాలంలో డీప్ ఫ్రై, క్రిస్పీ గా ఉన్న ఆహార పదార్థాలు తినాలని కోరుకుంటుంది.

డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కాబట్టి మనకు డీప్ ఫ్రై వంటి ఆహారపదార్థాలు తినాలని అనిపించినా అవి తినకుండా మనం మంచి చిరుతిండ్లు తినవచ్చు. వేడిగా మనకు తినాలి అనిపించినా అప్పుడు మనం మొక్కజొన్న ఉడికించుకొని దాని పైన ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది.

కూరగాయలను గ్రిల్ చేసుకొని సాండ్ విచ్ చేసుకున్నా బాగుంటుంది. పచ్చి మొలకలతో సలాడ్ చేసుకోవచ్చు. ఆలూ చాట్, ఆలూ దహీ చాట్, బేక్డ్ ఆలూ చాట్ చేసుకొని తినవచ్చు. పాప్ కార్న్ తినవచ్చు. మనకు వేడి వేడిగా కారంగా ఏమైనా తినాలని అనిపిస్తే పైన చెప్పినవి తినవచ్చు ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచివే.

 

Also Read : Sweet Potato Health Benefits: చిలకడదుంపతో ఆరోగ్య ప్రయోజనాలే కాదండోయ్.. ఆ సమస్యలకు చెక్?

  Last Updated: 28 Jul 2023, 10:21 PM IST