Site icon HashtagU Telugu

Ice Bath : సెలబ్రెటీలు ఎక్కువగా ఐస్ బాత్ చేస్తున్నారు.. దీని వెనుక గల కారణం మీకు తెలుసా?

Why Recent Times Celebrities Prefer Ice Bath Benefits of Ice Bath

Why Recent Times Celebrities Prefer Ice Bath Benefits of Ice Bath

Ice Bath : సెలబ్రెటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐస్ బాత్ చేస్తున్నారు. ఇంకా ఐస్ బాత్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఐస్ బాత్ చేయడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఐస్ బాత్ అంటే ఐస్ వాటర్ లో స్నానం చేయడం. దీనినే క్రియోథెరపీ అని కూడా అంటారు. ఇటీవల సమంత, రకుల్, ప్రగ్యా జైస్వాల్, మెహ్రీన్.. ఇలా పలువురు హీరోయిన్స్ ఐస్ బాత్ చేసి ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేసుకున్నారు.

ఐస్ బాత్ ను వ్యాయామం చేసిన తరువాత చేయాలి. ఐస్ బాత్ చేసే నీరు 50 నుండి 59 డిగ్రీ ఫారెన్ హీట్ మధ్యలో ఉండాలి. ఈ నీటిలో 11 నుండి 15 నిముషాల పాటు ఐస్ బాత్ చేయవచ్చు. ఈ విధంగా ఐస్ బాత్ చేయడం వలన మన కండరాలు బలంగా తయారవుతాయి. ఐస్ బాత్ చేయడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి సహాయపడుతుంది.

ఐస్ బాత్ చేయడం వలన మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఇంకా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఐస్ బాత్ చేయడం వలన చర్మం పైన రంధ్రాలు బిగుతుగా అయ్యేలా చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. అయితే ఐస్ బాత్ అనేది ఒక పదిహేను నిముషాలు మాత్రమే చేయాలి అంతకంటే ఎక్కువ చేస్తే మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఐస్ బాత్ అనేది ట్రైనర్స్ పర్యవేక్షణలో చేస్తే ఇంకా మంచిది. కొంతమంది మంచు ప్రదేశాలకు వెళ్లి డైరెక్ట్ గా ఐస్ బాత్ చేస్తుంటే, మరికొంతమంది ఇక్కడే క్రియోథెరపి పద్దతిలో చేస్తున్నారు. మన సెలబ్రెటీలు అందం మరియు ఆరోగ్యంగా ఉండడం కొరకు ఇలా ఐస్ బాత్ చేస్తున్నారు.

 

Also Read : Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ