వందల కిలోమీటర్లు జర్నీ చేయాలంటే.. ఎవరైనా ముందుగా ఉపయోగించేది రైల్వే మార్గాన్నే. రైలులో అయితే.. రిజర్వేషన్ చేయించుకుని కూర్చుంటే ఎంచక్కా బెర్త్ పై పడుకుని వెళ్లొచ్చు. లేచే సరికి.. చేరుకోవలసిన స్టేషన్ కూడా వచ్చేస్తుంది. మీరు రైలు జర్నీ చేసేటపుడు.. బెడ్ షీట్లు, దిండ్లు ఇచ్చే ఉంటారు కదా. స్లీపర్ క్లాసుల్లో లేకపోయినా.. ఏసీ క్లాసుల్లో మాత్రం ఇవి కంపల్సరీ ఉంటాయి. ఏసీ కోచుల్లో ఉండే బెడ్ షీట్లు, పిల్లోలకు వేసే కవర్లు ఎప్పుడూ తెల్లగా తళతళ మెరుస్తూ కనిపిస్తాయి.
అవి అలా ఎందుకు ఉంటాయి. వైట్ కలర్ నే ఎందుకు ప్రిఫర్ చేస్తారో తెలుసా ? దీనివెనుక ఇండియన్ రైల్వే.. వ్యూహం ఒకటి ఉందట. అదేందంటే.. వందల రైళ్లు, వేల బెడ్ షీట్లు, దిండ్లు ఉంటాయి. రైళ్లు గమ్యస్థానాలకు చేరిన తర్వాత.. వాటిని శుభ్రం చేసేందుకు పంపుతారు. ఈ క్రమంలో 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వాటిని ఆవిరి బాయిలర్లలో వేసి ఉడికిస్తారు.
ఈ పద్ధతికి తెల్లని బెడ్ షీట్లే బెటర్. కలర్ ఉన్నవైతే.. ఆ వాషింగ్ పద్ధతికి రంగు వెలసిపోతాయి. పాతవిగా కనిపిస్తాయి. వైట్ బెడ్ షీట్స్ అయితే ఆ సమస్య ఉండదు. పైగా ఉతికిన ప్రతీసారి కొత్తవిగా కనిపిస్తాయి. ఎన్నిసార్లు ఉతికినా ఫ్యాబ్రిక్ పాడవ్వదు. ప్రయాణికుడి కూడా కొత్తదానిలా అనుభూతినిస్తాయి. ఇందుకే రైల్వే శాఖ వైట్ బెడ్ షీట్స్ కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది.