Site icon HashtagU Telugu

Alcohol and Steel Glass: స్టీల్ గ్లాస్‌లో మద్యం సేవిస్తే ప్రాణానికే ప్రమాదం.. అసలు రహస్యం ఇదే!

Alcohol And Heart Health

Alcohol

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇదే విషయాన్ని మనం నిత్యం కొన్ని పదుల సార్లు వింటూ ఉంటాం. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం ఆపరు. అయితే సాధారణంగా మందుబాబులు మద్యం తాగడానికి ఎక్కువగా గాజు గ్లాస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక చాలా సమయాల్లో ఇక తాగడానికి వేరే ఏమీ లేక స్టీల్ గ్లాసుల్లో తాగుతూ ఉంటారు. లేదంటే బయట దొరికే ప్లాస్టిక్ కవర్ గ్లాస్ లో తాగుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం మధ్యాహ్నం గాజు గ్లాసుల్లోనే సేవించడానికి ఇష్టపడుతూ ఉంటారు.

అయితే కేవలం మద్యాన్ని గాజు గ్లాసుల్లోనే సేవించడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గాజు గ్లాసులో మద్యం స్పష్టంగా కనిపిస్తుంది. దానిని చూస్తూ అనుభూతి చెందుతూ తాగుతారట. అదే స్టీలు గ్లాసులో ఐతే ఈ సదుపాయం ఉండదు. అలాగే మరొక కారణం ఏమిటంటే గాజు గ్లాసులో మద్యం సేవించడం అన్నది చాలా మంది స్టేటస్‌ కు గుర్తుగా కూడా భావిస్తారు. ఇక స్టీలు గ్లాసులో మద్యం సేవించడం అన్నది తక్కువ స్టేటస్‌ కు ప్రతీకగా చాలా మంది విశ్వాసిస్తూ ఉంటారు.

అలాగే చాలామంది మద్యం బాబులు స్టీలు గ్లాసుల్లో మద్యం సేవిస్తే ఆరోగ్యం చెడిపోతుందని అనుకుంటూ ఉంటారు. అయితే మద్యం తయారు చేసే కంపెనీల్లో ఈ మద్యాన్ని పెద్ద పెద్ద స్టీలు పాత్రలలోనే దీనిని తయారు చేస్తారు. స్టీల్‌ బాటిళ్లు, క్యాన్లలో చాలా మంది బీర్లు తాగడం చూసేవుంటారు. ప్రయాణ సమయాల్లో చాలా మంది స్టీలు పాత్రల్లో మద్యాన్ని దాచుకుని తాగుతారు. అయితే మద్యాన్ని స్టీల్ గ్లాసులో సేవించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు కానీ చాలావరకు అదొక ప్రస్టీజ్ సమస్యగా కూడా భావిస్తూ ఉంటారు.

Exit mobile version