Site icon HashtagU Telugu

Koreans : కొరియన్ వాళ్ళ చర్మ సౌందర్యం రహస్యం ఏంటి?

Why Korean People are Most Beautiful

Why Korean People are Most Beautiful

Koreans : ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే అందంగా ఉండాలని, తెల్లగా ఉండాలని, ముఖ్యంగా మన ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలని అనుకుంటారు. కొరియన్ ప్రజలు ఎంతో అందంగా వారి చర్మం పైన ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటారు. దానికి కారణం వారు తినే ఆహారం మరియు వారు పాటించే ఆరోగ్య నియమాలు. మనం కూడా ఎంతో అందంగా మరియు మన చర్మం పైన ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలంటే వారి జీవన విధానాన్ని పాటిస్తే మంచిది. అలాగే సాధారణంగా కొన్ని దేశాల్లోని ప్రజలు తెల్లగా, ఎర్రగా ఉంటారు. అది వారి భౌగోళిక స్వరూపం, వారి దేశ టెంపరేచర్, పరిస్థితుల వల్ల కూడా ఉంటుంది. కొరియన్స్ కి కూడా ఇది మినహాయింపు కాదు.

కానీ వారి ఆహార పద్ధతులు, జీవన ప్రమాణాలు కూడా కొరియన్స్ ని మరింత అందంగా ఉంచుతాయి. కొన్ని శతాబ్దాలుగా కొరియన్ ప్రజలు వారి జీవనంలో భాగంగా గ్రీన్ టీ ని ఉపయోగిస్తారు. గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచడానికి, బరువును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి, చర్మం పైన ముడతలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొరియన్ ప్రజలు వారు తినే వంటకాలలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే పసుపులో రోగనిరోధక, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొరియన్ ప్రజలు కీళ్ళ ఆరోగ్యానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి పసుపును ఉపయోగిస్తారు.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన చర్మానికి చాలా మంచిది. ఫ్లూ కాలంలో విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు కొరియన్ ప్రజలు. మామూలు రోజుల్లో కూడా రోజు విడిచి రోజు తింటూ ఉంటారు. కొల్లాజెన్ అనే ప్రోటీన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొల్లాజెన్ అనేది ఫిష్, బ్రొకోలీ, బెర్రీస్ వంటి ఆహార పదార్థాలలో ఉంటుంది. కొల్లాజెన్ గోర్లు మృదుత్వాన్ని పెంచుతుంది. మనం ముఖం పైన వచ్చిన ముడతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

చేపలను కొరియన్ ప్రజలు ఎక్కువగా తినరు అందుకని చేప నూనె, ఆల్గె కలిపి తీసుకుంటారు. దీని వలన వారు యవ్వనంగా, ఫిట్ గా కనిపిస్తారు. రోజూ వాకింగ్, శారీరక వ్యాయామాలు చేయడం వలన కొరియన్ ప్రజలు ఎంతో యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా నీరు తాగడం, ఒత్తిడి లేకుండా ఉండడం వలన అందంగా ఉంటారు. కాబట్టి మనం కూడా వాటిని పాటిస్తే అందంగా యవ్వనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

 

Also Read : Morning Food: ఉదయమే ఖాళీ కడుపుతో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్నో హెల్త్ బెన్ ఫిట్స్