Food: భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి!

చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు.

  • Written By:
  • Updated On - June 14, 2022 / 08:37 PM IST

చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు అని మన పెద్దలు చెబుతున్నప్పటికీ మనము వాటిని పెడచెవిన పెట్టేస్తూ ఉంటాం. అయితే పెద్దలు అలా చెప్పడానికి గల కారణం కూడా లేకపోలేదు. శాస్త్రీయ పరంగా కూడా తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎందుకంటే సేద్యం పై పేరుకున్న మురికి మొత్తం వదిలిపోతుంది. అదేవిధంగా శరీరంలో ఉన్న ప్రతి క్షణం కూడా ఉత్తేజం పొందుతుంది. స్నానం చేసిన తర్వాత ఎనర్జిటిక్ గా, ఫ్రెష్ గా ఫీల్ అవ్వడం వల్ల ఆకలి వేయడం మొదలవుతుంది. అందువల్ల స్నానం చేసిన తర్వాత అన్నం తినాలి. అలాకాకుండా తిన్న తర్వాత భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.అంతేకాకుండా ఏరికోరి మరీ మలబద్ధకాన్ని తెచ్చుకోవడం అవుతుంది. అలాగే ఉదర సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

కాబట్టి స్నానం చేసిన తర్వాత భోజనం చేయడం ఎంతో శ్రేయస్కరం. అలా చేయడం వల్ల ఆకలి పెరిగి తిన్నది ఒంట పడుతుంది. అలాగే పుస్తకాలు కూడా శరీరానికి అందుతాయి. అందువల్లే తిన్న వెంటనే స్నానం చేయకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.అలాగే హిందు గ్రంథాల ప్రకారం స్నానం చేయక ముందు ధరించిన వస్త్రాలనే లేదా బట్టలను స్నానం చేసిన తర్వాత వేసుకోకూడదు. అలా స్నానం చేయక ముందు ధరించిన బట్టలనే మళ్లీ వేసుకొని తినడం, చదవడం, దేవుణ్ని పూజించిడం లాంటి పనులు చేయొద్దు.