Women Financial Independence: స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాల్సిందేనా..?

నేటి యుగంలో పాటుగా స్త్రీలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు పయణిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం పురుషులతో పోల్చితే స్త్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా వస్తున్న పురుషుల ఆధిపత్యం కారణంగా భారత్ లో స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనకబడి ఉన్నారు.

  • Written By:
  • Publish Date - April 1, 2022 / 04:31 PM IST

నేటి యుగంలో పాటుగా స్త్రీలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు పయణిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం పురుషులతో పోల్చితే స్త్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా వస్తున్న పురుషుల ఆధిపత్యం కారణంగా భారత్ లో స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనకబడి ఉన్నారు. భారత్ లో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామందికి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు చేసే అవకాశం లభించడం లేదు. కొంతమంది స్త్రీలు పెళ్లి లేదా తల్లిగా బాధ్యతలు చేపట్టగానే తమ వృత్తిని త్యాగం చేసేస్తున్నారు. ఇంకొంతమంది మహిళలు చదువుని సంపాదించగలిగే సామర్థ్యం ఉన్నా…కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, పిల్లలను పెంచడం వీటిని కోసం ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది.

ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్య్రం అనేది ముఖ్యం. మనిషి తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడపడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలి. ఇలా కాకుండా పురుషులతో పాటు కూడా మహిళలు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందో…అప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారు.

స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఎందుకు అవసరం….?

ఖర్చు పెట్టే సామార్థ్యం పెరుగుతుంది…
ఒక స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే…తన కుటుంబాన్ని అన్ని విధాలుగా పరీరక్షించుకుంటుంది. కేవలం ఒక వ్యక్తి సంపాదనతో మంచి జీవితాన్ని గడపడం సాధ్యం కాదు. అందుకే భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తే…ఖర్చు చేసే సామార్థ్యం పెరుగుతుంది. ఇలా చేస్తే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.

స్త్రీకి స్వీయ గౌరవం లభిస్తుంది….
మనదేశంలో చాలా మంది స్త్రీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతోంది. అందుకే ఎప్పుడైతే స్త్రీకి ఆర్థిక స్వేచ్చ లభిస్తుందో అప్పుడే తన భర్తపై ఆధారపడకుండా జీవిస్తుంది. ఆమె తన ఖర్చుల కోసం తన భర్తను డబ్బు అడగాల్సిన అవసరం రాదు. ఇలా వారిలో ఆత్మగౌరవం పెరుగుతుంది.

కుటుంబం నుంచి గౌరవం లభిస్తుంది…
ఆర్థిక స్వేచ్చ ఉండే ప్రతి స్త్రీ కుటుంబంలోని ప్రతి సభ్యుడి నుంచి గౌరవాన్ని పొందుతారు. తమ ఫ్యామిలీపై ఆర్థికంగా ఆధారపడిన మహిళలు తరచుగా అవమానాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

అన్యాయాలను ప్రశ్నించగలదు….
ఆర్థికంగా నిలదొక్కలేని స్త్రీలు తమ కోసం లేదా సమాజంలోని అణగారిన వ్యక్తి కోసం నిలబడలేరు. భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల సంపాదన మీద జీవించే స్త్రీలు అన్యాయం ఎదురైనా…వారు గట్టిగా వాదించలేరు..ప్రశ్నించలేరు.

స్త్రీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది…
ఆర్థిక స్వాతంత్య్రం అనేది ప్రతి వ్యక్తికి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ఉంటే…ఆమె తన కుటుంబం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురాగలదు.