Site icon HashtagU Telugu

Love Propose : అమ్మాయిలు ఫస్ట్ ప్రపోజ్ ఎందుకు చేయరు ? త్వరగా ఎందుకు యాక్సెప్ట్ చేయరు ?

love propose

love propose

Love Propose : ప్రేమ.. ఇది ఎప్పుడు ఎవరిలో అలజడి రేపుతుందో.. ఎవరిని ఊహల్లో విహరించేలా చేస్తుందో తెలీదు. కానీ ప్రేమనేది ఒక అందమైన అనుభూతి. అది ఇరువైపులా ఉంటేనే ఆ అనుభూతిని పొందగలరు. నచ్చిన మనిషితో జీవితాన్ని పంచుకోగలగడం ఒక వరం. ఆ అదృష్టం అందరికీ ఉండదు. మనసులో ఒకరిపై ప్రేమ ఉంటే.. అది వాళ్లకి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. చెప్పిన తర్వాత వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో.. యాక్సెప్ట్ చేస్తారో లేదోనన్న ఆందోళన కూడా ఉంటుంది. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడంలో దాదాపు అబ్బాయిలే ముందుంటారు. అమ్మాయిలు చెప్పాలనుకున్నా చెప్పలేరు. అందుకు రకరకాల కారణాలున్నాయి.

అమ్మాయిలకు అబ్బాయిలంటే ఎనలేని ప్రేమ ఉన్నా ఫస్ట్ ప్రపోజ్ చేయాలనిపించదు. తీరా ప్రపోజ్ చేశాక ఒప్పుకోకపోతేనో.. అనే భయం ఉంటుంది.

మన దేశంలో భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని ఆచారాలు, నిబంధనలను పాటిస్తారు. వాటివల్ల కూడా అమ్మాయిలు ముందుగా తమ ప్రేమను చెప్పేందుకు వెనుకాడతారు. కాబట్టి అబ్బాయిలే మొదట ప్రపోజ్ చేస్తారు.

చాలా సందర్భాల్లో అబ్బాయిలు తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసినా.. అమ్మాయిలు అంగీకరించరు. అందుకు కారణం.. ఇతరులు, సమాజం ఏమనుకుంటోదనన్న భయం. ప్రేమను అంగీకరిస్తే ఆమె గురించి చెడుగా మాట్లాడుతారన్న ఆలోచన కూడా ప్రేమను ఒప్పుకోనివ్వదు.

అబ్బాయి ప్రపోజ్ చేసినపుడు యాక్సెప్ట్ చేస్తే సరిపోదు. ఆ తర్వాత వారి ప్రయాణం ప్రేమికుల నుంచి దంపతుల వరకూ జీవితాంతం కంటిన్యూ అవ్వాలి. కొన్నిసార్లు ప్రేమికుల మధ్య మనస్పర్థలు ఏర్పడి మధ్యలోనే బ్రేకప్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే అమ్మాయిలు మొదట ప్రపోజ్ చేస్తే.. అబ్బాయిలు మధ్యలో వదిలేస్తారని చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు.

అమ్మాయిలు తమ లవర్ పర్ ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. అబ్బాయి వ్యక్తిత్వం, గుణం మంచిదో కాదో నిర్ణయించుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనివల్ల కూడా ప్రేమను అంగీకరించడంలో జాప్యం జరుగుతుంది.

ప్రేమికుల మధ్య గొడవలు సహజం. అమ్మాయి ముందు ప్రపోజ్ చేస్తే.. అలాంటి సమయంలో తమను వేలెత్తి చూపుతారేమోనన్న భయం కూడా అమ్మాయిలకు ఉంటుంది. మొదట ప్రేమించానని చెప్పింది నువ్వే అని ఎత్తిచూపుతారని.. తమ ప్రేమను వ్యక్తం చేయడంలో సందేహిస్తారు.

Exit mobile version