Fast Ageing: 40లలోనే 60ల వయసు ఉన్నట్టు కనిపిస్తున్నారా? ఈ అలవాట్లే కారణం

అలవాట్లు బాగా లేక, లైఫ్ స్టైల్ లో లోపం కారణంగా కొందరు 40 ఏళ్ల వయసు దాటకముందే 60 ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 07:30 AM IST

నేటికాలంలో లైఫ్ స్టైల్ చాలా చాలా ముఖ్యం..

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ తోనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం.

మన అలవాట్లే మన ముఖ చిత్రాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఫిట్ నెస్ ను, మన లుక్ ను నిర్దేశిస్తాయి.

అలవాట్లు బాగా లేక, లైఫ్ స్టైల్ లో లోపం కారణంగా కొందరు 40 ఏళ్ల వయసు దాటకముందే 60 ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. వారిని ఇలా మార్చినవి కొన్ని అలవాట్లే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ముసురుకునేలా చేసే కొన్ని డేంజరస్ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వాటిక్ దూరంగా మసులుకుందాం..

*ఎండలో ఎక్కువసేపు

ఎండలో ఉండాల్సిన సమయాని కంటే ఎక్కువ సేపు ఉండొద్దు. అలా ఉంటే మీ చర్మం పై ఫైన్ లైన్స్, రింకుల్స్ కనిపించే పరిస్థితి వస్తుంది. ఫలితంగా క్రమక్రమంగా మీ చర్మం లుక్ ముసలోళ్ళ చర్మంలా మారిపోతుంది. ఈ పరిస్థితి రావద్దంటే మీరు ఎండలోకి బయలుదేరే ముందు సన్ స్క్రీన్ లోషన్ ను వాడాలి. చర్మానికి లోషన్ పెట్టుకోవాలి.ప్రధానంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో తిరగకుండా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు
హైకింగ్, స్విమ్మింగ్ ఇతరత్రా ఔట్ డోర్ యాక్టివిటీస్ లో పాల్గొంటుంటే
.. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ లోషన్ ను వాడాలి.

* విటమిన్ డీ లోటు

మన చర్మం లో విటమిన్ డీ తక్కువగా ఉంటే స్కిన్ క్యాన్సర్ సహా ఎన్నో రుగ్మతలు వచ్చే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో విటమిన్ డీ లోటు వల్ల పలు ఆరోగ్య సమస్యలు సతాయిస్తుంటాయి. మెడికల్ షాపుల్లో అనేక విటమిన్ డీ సప్లిమెంట్స్ లభిస్తుంటాయి. వాటిని తినడం ద్వారా మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

* తక్కువ నిద్ర పోవడం..

తక్కువ నిద్రపోయే వాళ్లకు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నిద్రపోయే సమయంలో శరీర కణాల్లో రిపేరింగ్ యాక్టివిటి జరుగుతుంది. కాబట్టి మీరు రోజూ 8 గంటలకు తగ్గకుండా నిద్రపోయే ప్రయత్నం చేస్తే మంచిది. నిద్ర సరిగ్గా లేకుంటే మన స్ట్రెస్ లెవల్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగితే మన నాడీ వ్యవస్థ కార్టిజల్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మన చర్మం లో ఆయిల్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. ఫలితంగా చర్మం లోని పోర్స్ మూసుకుపోతాయి. ఫలితంగా చర్మం పై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

* ధూమపానం, మద్యపానం

అతిగా ధూమపానం చేసేవాళ్ళు బీ అలర్ట్. పొగాకులో ఎన్నో విష తుల్య పదార్థాలు ఉంటాయి.ఇవి మన చర్మంలోని ఆక్సిజన్, ఇతర పోషకాల మోతాదును తగ్గించేస్తుంది. స్మోకింగ్ చేస్తే చర్మం కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా మీరు ముసలోళ్ళలా కనిపిస్తారు. మద్యం తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి అవుతుంది. చర్మం పై రింకుల్స్ ఏర్పడుతాయి.

* నీళ్లు తక్కువ తాగడం

సాధ్యమైనంత మేర మనం నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తక్కువ తాగే వాళ్ళు త్వరగా అలసిపోతారు. తరుచూ వ్యాధుల బారిన పడుతుంటారు. చర్మ సమస్యలు వస్తుంటాయి. తక్కువ నీళ్లు తాగితే చర్మం పొడిబారుతుంది. డార్క్ సర్కిల్స్ చర్మం పై ఏర్పడుతాయి. నీళ్లు బాగా తాగితే స్కిన్ బ్రైట్ గా తళతళలాడుతుంది.

శరీరాన్ని మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ.. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ.. బాగా నీళ్లు తాగుతూ..వ్యాయామం చేస్తూ.. స్ట్రెస్ ను తగ్గించుకుంటే వృద్ధాప్య ఛాయలు మీ దరి చేరవు.