Ask Expert : నా భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో రిలేషన్ లో హ్యాపీగా ఉన్నాను…విడాకులు ఇవ్వడం కుదరడం లేదు…!!

రిలేషన్ షిప్ ను కొనసాగించడం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్న పని. అయినా కూడా వైవాహిక జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం యుద్ధం లాంటిదే.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 10:00 AM IST

రిలేషన్ షిప్ ను కొనసాగించడం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్న పని. అయినా కూడా వైవాహిక జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం యుద్ధం లాంటిదే. భార్యాభర్తల మధ్య బాధ్యత ఉంటే సరిపోదు, ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉండాలి. కొన్ని జంటలు ఈ విషయంలోనూ విజయం సాధిస్తారు. కొంతమంది మాత్రం ప్రేమ, బాధ్యతను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఇద్దరిలో ఒకరు దానిని విస్మరించడం ప్రారంభిస్తారు. అప్పుడు దంపతుల మధ్య ప్రేమ తగ్గుతుంది. ఇది అవిశ్వాసానికి దారి తీస్తుంది. జీవిత భాగస్వామిని మోసం చేయడానికి ప్రేమ లేకపోవడం, గౌరవం లేకపోవడం, ఒకరి కోరికలు మరొకరు పట్టించుకోకపోవడం. మీ భాగస్వామిని మోసం చేయడం, అయితే మోసం చేయడం కన్నా కూడా చేస్తున్న మోసాన్ని అంగీకరించడం చాలా కష్టం. చాలా మంది మహిళలు తమ భాగస్వామిని మోసం చేసిన తర్వాత అంగీకరించడం అంత సులభం కాదని చెబుతున్నారు. భార్య తన భర్తను మోసం చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ఓ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో లో పంచుకుంది. ఆమె ఒక వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉంది. కానీ తన భర్తకు అనుమానం రాగానే ఆమె కంగారు పడినట్లు ఆ మహిళ చెప్పింది. నేను నా భర్తను మోసం చేసిన మాట వాస్తవమేనని, ఆ మహిళ తన భర్త ముందే ఒప్పుకుంది. తాను వివాహ బంధంలో సంతోషంగా లేనని, తన భర్త తన దగ్గరికి రావడానికి కూడా భయపడేవాడని, దీంతో తన భర్తను మోసం చేయడానికి ఇది ఒక కారణమని చెప్పింది. అయితే తన భర్తకు అనుమానం వచ్చినప్పటికీ, ఆ విషయం తన భర్తకు తెలియాలని కోరుకుంది. ఇది వారు వేరు పడేందుకు సహాయపడుతుందని తాను నమ్ముతున్నాను, ఆ మహిళ చెప్పింది.

మరో మహిళ కూడా తన భర్త తనను మోసం చేశాడని, మరోమహిళతో వివాహేతర బంధంలో ఉన్నట్లు చెప్పింది. తన భర్త ఆమెను ప్రేమించడం లేదని. తనను ఇంట్లోని వస్తువులా చూసేవాడని, అది తనకు నచ్చలేదని, అందుకే నేను నా భర్త నుండి దూరంగా ఉండాలనుకున్నాను. ఎవరైనా తనను ప్రేమించాలని కోరుకున్నాను. నా భర్త నుంచి విడిపోవాలని అనుకున్న సమయంలో తనను ప్రేమించే వ్యక్తి దొరికాడని ఆ మహిళ చెప్పింది.

భర్తతో విడిపోని ఓ మహిళ.. మోసం చేశానని ఒప్పుకుంది. భర్తపై అస్సలు ప్రేమ లేదు. తాను మరొక వ్యక్తితో సంబంధంలో ఉన్నాని. అతనికి కూడా పెళ్లయిందని. అయితే తాను అతనిని చాలా ప్రేమిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు అతనిని విడిచిపెట్టలేను. మా సంబంధం బలంగా ఉందని. అయితే తన భర్తకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది.

మరో మహిళ ఓ విచిత్రమైన ఘటన షేర్ చేసింది. ఆమె భర్త , ఇతర స్త్రీలతో చనువుగా ఉంటున్నాడని, దీంతో భార్యకు కోపం వచ్చింది. భర్త మాత్రం ఇతర స్త్రీలతో చనువుగా ఉండే వ్యసనాన్ని వదిలించుకోలేకపోయాడు. దాంతో భర్తను మోసం చేయాలని నిర్ణయించుకొని. ఇప్పుడు మరొక వ్యక్తితో సంబంధంలో సంతోషంగా ఉన్నానని తెలిపింది. అంతేకాదు తన భర్తను మోసం చేశాననే భావన తనకు లేదని చెప్పింది.