Site icon HashtagU Telugu

Dogs: స్నేహంగా ఉండే కుక్కలు.. క్రూరంగా ఎందుకు మారాయి?

Why Do Friendly Dogs Become Ferocious

Why Do Friendly Dogs Become Ferocious

మనిషికి నమ్మిన బంటు ఏదైనా ఉందంటే అది కుక్క. మనిషికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే జంతువు కుక్క.. ఇటీవల కాలంలో కుక్క కాటుకు మరణాలు సంభవించిన ఘటనలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో కుక్క కరవడంతో ఓ బాలుడు మృతిచెందడం వివాదం సృష్టించింది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడం, వ్యాక్సినేషన్ చేయడం మాత్రమేనని జంతు ప్రేమికులు వాదిస్తున్నారు. ఇంకొందరు మాత్రం కుక్కలను చంపడమే పరిష్కారం అని అంటున్నారు. ఇంతకీ మనుషులకు ఫ్రెండ్లీ గా ఉండే వీధి కుక్కలు (Dogs) ఎందుకు ఇలా క్రూరంగా మారాయి? అవి ఎందుకు రక్తాన్ని కళ్ళజూస్తున్నాయి ? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది.

ఆకలి కేకలు:

ఆకలి.. ఇది మనిషికైనా , వీధి కుక్కకైనా ఒక్కటే. వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి తిండి, నీరు పెట్టే వాళ్ళు కరువయ్యారు. ఆఫ్రికా నుంచి ఇండియాకు తెచ్చే క్రూరమైన పులులకు జూలలో భోగభాగ్యాలు కల్పిస్తారు. రోజూ వాటికి మెనూ అమలు చేస్తారు. కానీ రోజూ జనం మధ్య తిరిగే, అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే కుక్కలకు పెట్టేందుకు బుక్కెడు బువ్వ ఉండదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. కుక్కలను పట్టేందుకు స్పెషల్ టీమ్స్ ను రిక్రూట్ చేస్తారు.. కానీ కుక్కలకు నీళ్లు, బ్రెడ్ ఇచ్చేటందుకు స్పెషల్ టీమ్స్ రిక్రూట్ చేయరు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఒక ఐడియా..

విదేశీ జాతి కుక్కలను దత్తత తీసుకోవడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దేశీ కుక్కలను కూడా జంతు ప్రేమికులు దత్తత తీసుకునేలా ఒక సిస్టం ను దేశంలోని అన్ని స్థానిక సంస్థల్లో డెవలప్ చేయాలి. ఇందులో భాగంగా దేశీ కుక్కలను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పెంచేందుకు ఫామ్స్ ఏర్పాటు చేయాలి. వాటిలో పెంచే దేశీ కుక్కలకు పౌష్టికాహారం ఇవ్వాలి. వాటిని ఆసక్తి కలిగిన జంతు ప్రేమికులకు దత్తత ఇవ్వాలి. దత్తత ఇచ్చినందుకు నామమాత్రంగా కొంత మొత్తం తీసుకోవాలి. తద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం కూడా లభిస్తుంది.

కొన్ని కేస్ స్టడీలు:

ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఆసుపత్రిలో నెలరోజుల పసికందును వీధికుక్కలు (Dogs) కొట్టి చంపాయి. సిరోహి ఘటనలో పసికందు తన తల్లి పక్కనే నిద్రిస్తున్నప్పుడు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అతడి మృతదేహం ఆస్పత్రి వార్డు బయట కనిపించింది. ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి రెండు కుక్కలు వెళ్లగా.. వాటిలో ఒకటి పసిపాపతో తిరిగి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. లక్నోలోని జానకీపురంలో ఉన్న ఒక ఎత్తైన భవనంలో గత రెండు నెలల్లో కుక్కల దాడి సంఘటనలు 5 చోటుచేసుకున్నాయి.

Also Read:  Kavitha Case: కవిత అరెస్ట్ కు మరిన్ని ఆధారాలు!బిజినెస్ పార్ట్నర్ పిళ్ళై కి ఈడీ బేడీలు