Site icon HashtagU Telugu

Ayurveda and Sweets: స్వీట్స్ ఎప్పుడు తినాలి? భోజనానికి ముందా…తర్వాతా…ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

Sweet

Sweet

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. భోజనం చివర్లో స్వీట్స్ తిడనం మంచిదన్న మాటన ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటారు. పదిమందిని పిలిచి పెట్టే భోజనాల్లో స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే కొందరు భోజనానికి ముందు స్వీట్ తింటుంటారు. భోజనం చేసేంతవరకు ఆగడం లేదా అంటూ…వారిని చూసి ఇతరలు నవ్వుతుంటారు. చాలామంది పెరుగన్నం ముందో..లేదంటే భోజనం పూర్తయ్యాకనో స్వీట్స్ తింటారు. మరి ఆయుర్వేదం స్వీట్స్ ను ఎప్పుడు తినాలని చెబుతోంది. తెలుసుకుందాం.

భోజనాన్ని స్వీట్స్ తో ప్రారంభించాలి ఆయు ర్వేదం చెప్పిందని…దీంతో జీర్ణక్రియ సాఫీగా జరగడంతోపాటు మంచి పోషకాలు అందుతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. స్వీట్లను మనం ఏ సమయంలో తీసుకుంటున్నామో దాని ఆధారంగా అది జీవశక్తిని ఇస్తుదా లేదా హాని కలిగిస్తుందా అన్నది ఆధారపడి ఉంటుంది.

స్వీట్లు తిన్నతర్వాత అవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. భోజనానికి ముందుగా స్వీట్స్ తినడం వల్ల జీర్ణరసాల రిలీజ్ ముందుగానే మొదలవుతుంది. దీంతో ఆహారం మంచిగా జీర్ణమయ్యేదుకు సాయపడుతుంది. కానీ భోజనం చివర్లో స్వీట్స్ తిన్నట్లయితే జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

భోజనానికి ముందు స్వీట్స్ తింటే రుచి మొగ్గలు విచ్చుకుంటాయని వివరించారు. అలా కాకుండా భోజనం పూర్తయ్యాక తినడం వల్ల జీర్ణాగ్నీ కలిగిస్తుందని…ఆమ్ల స్రావాలు రిలీజ్ దారితీయవచ్చని…అజీర్ణం కలిగించే ఛాన్స్ ఉంటుందంటున్నారు.

Exit mobile version