Hair Treatment: నల్ల జుట్టు కావాలా.. అయితే చిట్కాలను ఉపయోగించండి..?

ప్రస్తుత రోజుల్లో చుట్టూ రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో మహిళలు ఇబ్బందులను

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చుట్టూ రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం, నల్లని జుట్టు కోసం, జుట్టు ఒత్తుగా పెరగడం కోసం మహిళలు ఎన్నో రకాల చిట్కాలను, షాంపూలను, హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే అనేక రకాల షాంపూలు వల్ల జుట్టు ఓడిపోవడం సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరి ఇంట్లోనే దొరికే కొన్ని వంటింటి చిట్కాలు ద్వారా నల్లని జుట్టు ను తిరిగి పొందడం ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నల్లని జుట్టు కోసం ఎటువంటి చిట్కాలను పాటించాలి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం.. ఇందుకోసం ముందుగా ఉసిరి పొడిని తీసుకోండి. అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసుకుని, దానిని తలకు పట్టించి రెండు గంటలు ఆగిన తరువాత, తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అలాగే ఉల్లిగడ్డను వేస్ట్ అలా చేసి దానిని తెల్ల వెంట్రుకలు ఉన్నచోట రాయాలి. రెండు గంటలు ఆగిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచుగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజు ఆ మీశ్రమాన్ని తలకు పట్టించి స్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. అలాగే నువ్వులను మిక్సీలో వేసి అందులో బాదం వేసి పేస్టులా చేసుకుని దానిని తలకు పట్టించి ఆ తరువాత స్నానం చేయాలి. అదేవిధంగా తరచుగా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.