Site icon HashtagU Telugu

White Hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ సింపుల్ చిట్కా ఉపయోగించాల్సిందే?

Mixcollage 22 Mar 2024 08 26 Pm 2008

Mixcollage 22 Mar 2024 08 26 Pm 2008

ప్రస్తుతం రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు లోనే తెల్ల జుట్టు సమస్యతో చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే తెల్ల జుట్టును కవర్ చేసుకోవడం కోసం చాలామంది అనేక రకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల హెయిర్ ఆయిల్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఫలితం లేక దిగులు చెబుతూ ఉంటారు. మీరు కూడా తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.

మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నూనెలో కలోంజి గింజలను 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత వడగట్టి రాత్రివేళ జుట్టుకు పట్టించాలి. కుదుళ్లకు కూడా అంటుకునేలా చిన్నగా మర్దనా చేసి నూనెను అప్లై చేయాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి. కలోంజీతో పాటు హెన్నాను కూడా వాడొచ్చు. కలోంజీ గింజలను గిన్నెలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. అందులో హెన్నా కలిపి పేస్ట్‌లా చేసి జుట్టు మీద అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి.

తర్వాత నీటితో జుట్టును కడగాలి. తర్వాత జుట్టు నల్లగా మారుతుంది. వీటితోపాటు అశ్వగంధ పొడిని ఉపయోగించడం వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అశ్వగంధ పొడి తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఫాలో అవ్వడంతో పాటు మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య రాదు.