white Hair: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే బొప్పాయితో ఇలా చేయాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తెల్లజుట్టు సమస్య కూడా ఒకటి. కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే కాకుండా యుక్త

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 05:15 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తెల్లజుట్టు సమస్య కూడా ఒకటి. కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే కాకుండా యుక్త వయసు వారికి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. ఇంకా చెప్పాలంటే 12 ఏళ్ల పిల్లవాడు నుంచే ఈ తెల్ల జుట్టు సమస్య మొదలవుతుంది. అయితే ఈ తెల్ల జుట్టు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రకరకాల హెయిర్ స్టైల్ ను వాడడం అలాగే తింటున్న ఆహారంలో లోపాలు ఉండడం, పెరుగుతున్న కాలుష్యం, రసాయనాలు షాంపూలు ఇలాంటివన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో 45 లేదా 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే తెల్ల జుట్టు వచ్చేది.

కానీ ప్రస్తుతం రోజుల్లో మాత్రం చిన్న పిల్లలకే ఈ సమస్య మొదలవుతోంది. మరి తెల్ల జుట్టు సమస్యకు ఏం చేయాలి? అందుకోసం ఎటువంటి చిట్కాలను ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలామంది విటమిన్ లోపాల వల్ల బాధపడుతున్నారు. సరైన సమయానికి ఫుడ్డు తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు అందడం లేదు. విటమిన్ల లోపాల వల్ల జుట్టు కూడా త్వరగా నెరిసిపోతుంది. అయితే తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే బొప్పాయితో ఒక రెమిడీని ట్రై చేయాల్సిందే. ఇందుకోసం ముందుగా రెండు బొప్పాయి ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ క్రమంలోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ లో వేసి బొప్పాయి ఆకుల రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు బిర్యాని ఆకులు ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఒక గ్లాసు నీరు పోసి అవి అర గ్లాసు అయ్యేవరకు స్టవ్ మీద బాగా మరగబెట్టాలి. తర్వాత మరొక పాత్రను తీసుకొని తరచుగా వాడే హెన్నా పౌడర్ కొంచెం వేసుకోవాలి. మీ పేరుకి సరిపోయే అంత హెన్నా పౌడర్ బౌల్ లో వేసుకొని తర్వాత బొప్పాయి ఆకుల రసాన్ని కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే కాఫీ పొడి డికాషన్ ఇందులో వేసి బాగా కలపాలి. ఒక పేస్టు లాగా అవుతుంది. రాత్రంతా మూత పెట్టి అలా ఉంచేయాలి. ఒకవేళ రాత్రంతా మూత పెట్టి అలా ఉంచడం కుదరకపోతే కనీసం ఐదు గంటల పాటు అయినా అలా నాననివ్వాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని చుట్టుకుదురుల వరకు బాగా అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత షాంపూ వాడకుండా మామూలు నీళ్లతో స్నానం చేయాలి. మొదట మామూలు నీళ్లతో తల స్నానం చేసి ఆ తర్వాత రెండు సార్లు షాంపూతో స్నానం చేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇలా బొప్పాయి ఆకులు వాడటం వల్ల తలలో చుండ్రు అలాగే దురదలు పోతాయి. అంతేకాకుండా చుట్టూ బాగా సైనిగా ఉంటుంది.