Bedroom Rules : భార్య భర్తకు ఎటువైపు నిద్రపోవాలి.. పడకగదిలో పాటించాల్సిన నియమాలు ఇవే?

వాస్తు శాస్త్ర ప్రకారం పడకగది (Bedroom)లో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి కూడా తెలిపారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Which Side Should The Husband And Wife Sleep On.. These Are The Rules To Follow In The Bedroom..

Which Side Should The Husband And Wife Sleep On.. These Are The Rules To Follow In The Bedroom..

Bedroom Rules : పెళ్లి అయిన తర్వాత ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రకాల విషయాలను గుర్తుంచుకోవాలి. కొందరు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటే జీవితంలో అన్నీ ఉన్నాయని భావించి వైవాహిక జీవితం ఆనందంగా లేకపోతే అన్నీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ భావిస్తూ ఉంటారు. దంపతుల మధ్య సఖ్యత జీవితంలో సుఖసంతోషాలతో పాటు సంపదను కూడా అందిస్తుందని చాలామందికి తెలియదు. అంతే కాకుండా కొంతమంది భార్య భర్తలు ఇంట్లో తరచూ ఏదోక విషయంతో గొడవ పడుతూనే ఉంటారు.

అలా నిత్యం వాదులాడుకునే, కీచులాడుకునే దంపతులుండే ఇంట్లో లక్ష్మిదేవి అస్సలు ఉండదట. కాగా వాస్తు శాస్త్రంలో వివాహిత మహిళలు చెయ్యాల్సిన పనులు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించారు. వాస్తు శాస్త్ర ప్రకారం పడకగది (Bedroom)లో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి కూడా తెలిపారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

వాస్తు ప్రకారం దంపతుల బెడ్ రూమ్ ఇంటిలో వాయవ్య లేదా నైరుతి దిశలో ఉండాలి. ఈ దిక్కులు వారి మధ్య ప్రేమను పెంచేందుకు దోహదం చేస్తాయి. మంచం మీదకు ఎలాంటి వెలుతురు నేరుగా పడకుండా చూసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవీ కూడా దంపతులు నిద్రించే గదిలో పెట్టుకోకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను గది బయట వదిలెయ్యాలి. మంచం ఏర్పాటు చేసుకునే సమయంలోనే మంచం తల దక్షిణం వైపు ఉండేట్టుగా చూసుకోవాలి.

ఇక దంపతులు ఇంటికి యజమానులైతే పడకగది (Bedroom) తప్పని సరిగా నైరుతిలో ఉండాలి. నూతన దంపతులై, ఉమ్మడి కుటుంబంలో ఉండే వారైతే వాయవ్యంలో ఉండడం మంచిది. ఈశాన్యం వైపు ఉండే పడకగది (Bedroom) దంపతులకు కేటాయించకపోవడమే మంచిది. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వారు ఆగ్నేయం వైపున్న పడకగది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే వివాహిత మహిళ వాయవ్యంలో ఎప్పుడూ నిద్రించకూడదు. వాయవ్యం అంటే ఉత్తరం పశ్చిమ దిక్కులు కలిపే మూలగా చెప్పుకోవాలి. వాయవ్యానికి అధిపతి చంద్రుడు. ఈ దిక్కున నిద్రించే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించిన కలలు కంటారని అంటుంటారు. కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలోని వాయవ్యం వైపు పడుకోకూడదు.

అంతేకాదు వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కినుక వహిస్తాడట. అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవడం శుభప్రదం. కానీ పడుకున్నపుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు, అందుకే ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఉంచి నిద్రించకూడదు. ఇలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మంచంలో వివాహం అయిన స్త్రీలు కుడివైపు, భర్తకు ఎడమ వైపు వివాహిత మహిళలు నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ది చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావు.

Also Read:  Chat Lock : వాట్సాప్ ఛాట్స్‌‌ను లాక్ చేసేందుకు ‘సీక్రెట్ కోడ్’

  Last Updated: 01 Dec 2023, 11:42 AM IST