ప్రతి మనిషిని ఎప్పుడూ ఏదో సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం మార్గాలు మనమే వెతుకోవాలి. అంతేకానీ సమస్య గురుంచి అతిగా ఆలోచిస్తూ ఉంటే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ పని చేస్తేనే కాదు.. ఎక్కువగా ఆలోచించినా అలసట తప్పదంటా. శారీరకంగా అలసిపోతే సమస్య ఉండదు. కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఓ సారి చూద్దాం..!
– పెద్దలు చెప్తుంటారు అతి ఏ విషయంలోనూ మంచిది కాదు అని. అది నిజమే ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉన్న సమయాన్ని గడిపే అవకాశాన్ని కోల్పోతారు.
– అతిగా ఆలోచన మన ఫుడ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆకలి సరిగా వేయదు. కాస్త తినగానే కడుపు నిండినట్లు ఉండి చేయి కడిగేస్తారు. కొంతమందికి భోజనం చేయాలనే ధ్యాసే కూడా ఉండదు.
– ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం వల్ల మనం చేసే పని మీద ధ్యాస అసలు ఉండదు. దీంతో చేయాల్సిన అన్ని పనులు ఆలస్యమవుతాయి.
– ఎప్పుడూ డల్ గా ఉంటారు. చుట్టుపక్కల వారితో ఉన్న ఒంటరిగానే ఫీల్ అవుతుంటారు. మానసికంగా చాలా వరకు కుంగిపోతారు.
– సమస్య చిన్నదైనా, పెద్దదైనా పరిష్కారం కోసం వెతికినప్పుడు మాత్రమే ఆలోచించడం బెటర్. అలా కాకుండా రోజంతా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే సమయం వృథా అవుతుందే తప్ప సొల్యూషన్ ఉండదు.
– మీ ప్రవర్తనను బట్టి ఫ్రెండ్స్, బంధువులు మీ పరిస్థితిని అంచనా వేస్తారు. మీకు సమస్యలు ఉన్నాయనే విషయం ఇతరులకు తెలియకపోవడమే ఉత్తమం. అందువల్ల ఇతరుల ముందు యాక్టీవ్ గా ఉండటానికి ట్రై చేయండి.
– సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి. వాటి గురించే అలోచించి బాధపడకండి. ప్రశాంతంగా ఉండటం ఉత్తమం. ఆలోచనా పరిధి పెరిగి సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు.