No Chocolates: చాక్లెట్లు నెలరోజులు తినడం మానేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..?

సాధారణంగా చాకెట్లను పిల్లలు అతిగా ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ పెద్దలు పిల్లలను జాకెట్లు అదిగా తినకండి పళ్ళు

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 09:10 AM IST

సాధారణంగా చాకెట్లను పిల్లలు అతిగా ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ పెద్దలు పిల్లలను జాకెట్లు అదిగా తినకండి పళ్ళు పుచ్చిపోతాయి అని హెచ్చరిస్తూ ఉంటారు. చాక్లెట్ లోనే క్రీమ్ చాక్లెట్లను పిల్లలతో పాటు పెద్దలు కూడా కొంతమంది చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే నెల రోజులపాటు చాక్లెట్లు తినడం మానేస్తే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనం తినే డార్క్ చాక్లెట్లలో కోకో ఉంటుంది. ఆ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి మంచిదే కానీ, ఆ చాక్లెట్లలో కోకో 70 శాతానికి పైగా ఉండాలి. 50 శాతం మాత్రమే కోకో ఉంటే మిగిలిన 50 శాతం చక్కెర, డైరీ ఉత్పత్తులు ఉంటాయి.
షుగర్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇక నెల రోజులపాటు చాక్లెట్లు తినడం మానేస్తే మీ మూడ్ లో విపరీతమైన మార్పులు రావు. చాక్లెట్ లోని షుగర్,శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతుంది. దానివల్ల మన మూడ్ లో మార్పులు ఉంటాయి. చాక్లెట్ ని దూరం పెట్టడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలి అనుకుంటే చాక్లెట్లను తినడం మానేయాలి. అయితే ఒక నెల రోజులు చాక్లెట్లు తినడం మానేసిన మీరు చాలా క్యాలరీలు తగ్గుతారు.

తద్వారా బరువు కూడా పెరగదు. మనం తినే చాక్లెట్ లలో ఒక రకమైన యాసిడ్ ఉంటుంది. గుండెల్లో మంటను కలిగిస్తుంది. అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంది. మీరు నెల రోజులపాటు చాక్లెట్లు తినడం మానేస్తే మీకు నిద్ర బాగా పడుతుంది. ఎందుకంటే చాక్లెట్లో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఎక్కువైతే నిద్ర పట్టదు. ఒక సింగిల్ చాక్లెట్ బార్ లో 24 గ్రాముల షుగర్ ఉంటుంది. అటువంటి చాక్లెట్లు రోజుకు ఒకటి తిన్నా కూడా వారానికి మీ శరీరంలో 200 గ్రాముల షుగర్ చేరుతుంది. అలాగే చాక్లెట్లు తినడం మానేసిన తర్వాత మీకు తినడంపై కంట్రోల్ పెరుగుతుంది. మీరు ఎక్కువ తినకుండా మిమ్మల్ని మీరు ఆపుకోగలరు. ఫలితంగా మీకు డయాబెటిస్ అధిక బరువు సమస్యలు రావు.