Site icon HashtagU Telugu

Sleep: వారం రోజులు నిద్రపోకపోతే ఏం జరుగుతుంది.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయ్?

Sleep

Sleep

మనిషికి నిద్ర అన్నది చాలా అవసరం. మనిషికి కంటి నిండా నిద్ర లేకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక అధ్యయనంలో ఒక మనిషి తన జీవితంలో 9000 రోజులు నిద్రలోనే గడుపుతాడు అని తేలింది. అయితే నిద్ర తక్కువ కావడం వల్ల అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మనిషి నిద్రపోకుండా ఉండటం అన్నది అసాధ్యం. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో నిద్రపోకపోతేనే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిద్ర శారీరకంగా మానసికంగా చాలా అవసరం. నిద్ర సరిగా పోకపోతే సమస్యలు తలెత్తి ప్రాణాలు సైతం. కాబట్టి సాధారణ వ్యక్తులు రోజుకు అరగంట అటు ఇటుగా ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నిద్రపోవాలి.

దీనికంటే తక్కువగా నిద్రపోతే దానిని నిద్రలేమి సమస్య అని అంటారు. అయితే నిద్ర వస్తున్నప్పుడు మనకు నిద్ర పోవాలి అనిపిస్తుంది. కానీ నిద్రపోకుండా ఉండటం మొదటి 24 గంటలు సవాలుగా ఉంటుంది. అలాగే 24 గంటల పాటు మేల్కొని ఉండటం సాధారణమైన విషయమే. చాలా సందర్భాలలో చాలామంది రోజంతా కూడా నిద్రపోకుండా ఉంటూ ఉంటారు. 24 గంటల తర్వాత నిద్రపోకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువసేపు మేలుకోవడం వల్ల శరీరానికి శక్తి అవసరం కానీ అది అందదు. రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం కోల్పోవడంతో పాటు అలసిపోయి మత్తుగా అనిపిస్తుంది. 24 గంటల పాటు నిద్ర లేకపోతే దాని ప్రభావం మద్యం తాగినప్పుడు ఈ విధంగా అయితే మత్తుగా ఉంటుందో అలా ఉంటుంది.

48 గంటలు దాటిన తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మానసికంగా, శారీరకంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇందువల్ల వ్యక్తిగతీకరణ, ఆందోళన, విపరీతమైన ఒత్తిడిని అనుభవించడం మీరు చాలా అలసిపోతారు. కళ్లు కూడా మూతలు పడుతుంటాయి. దీనిని మైక్రోస్లీప్స్ అని కూడా అంటారు. అసలు నిద్ర పోతున్న విషయం కూడా తెలియకుండా ఇది జరిగిపోతుంది. కునుకుపాట్లు అనుకోవచ్చు. మైక్రోస్లీప్ సాధారణంగా 30 సెకన్ల వరకు ఉంటుంది. 3 రోజుల వరకు నిద్ర పోకుండా మెలకువగా ఉండటం చాలా కష్టం.

ఈ సమయంలో మీ మైక్రోస్లీప్‌లు కూడా ఎక్కువగా నిద్రపోతున్నట్లుగా మారతాయి. ఎందుకంటే మీ మెదడు మిమ్మల్ని నిద్రపోయేలా చేయడానికి తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తోంది. మూడు రోజులు నిద్ర లేకుండా ఉండటం వలన ఆలోచించే సామర్ధ్యంపై ప్రభావం పడుతుంది. మూడు రోజుల పాటు నిద్రపోకుండా అలాగే ఉండటం వల్ల..ఆందోళన అస్థిర మానసిక స్థితి,మగత, మతిమరుపు,ఏకాగ్రత కష్టం,అప్రమత్తంగా ఉండటం కష్టం, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్,పని లేదా పాఠశాలలో పనితీరు తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.