Diabetes: మధుమేహం ఉంటే గుడ్డు తినొచ్చా? గుండెకు మంచిదేనా?

కోడి గుడ్డు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కోడిగుడ్ల శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 09:15 AM IST

కోడి గుడ్డు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కోడిగుడ్ల శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కోడి గుడ్లలో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పొటాషియం, విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్-డి , విటమిన్ బి 6, విటమిన్ బి 12, మెగ్నిషియం గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. ఇకపోతే మధుమేహం ఉన్నవారు గుడ్డు తినవచ్చా లేదా అని సందేహిస్తూ ఉంటారు. మరి మధుమేహం ఉన్నవారు గుడ్డు తినవచ్చా లేదా అన్న విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయితే చాలామంది డయాబెటిస్ తో ఉన్నవారు గుడ్లు తింటే జబ్బులు వస్తాయని భావిస్తూ ఉంటారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదు అని అవన్నీ అవాస్తవాలు అని తేలింది. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలోనూ గుడ్డు తినడం వల్ల గుండె సమస్యలు తగ్గాయి అని తాజా అధ్యయనంలో వెల్లడించారు నిపుణులు.

అయితే ఏడాది పాటు వారానికి 12 గుడ్ల ను తినడం వల్ల డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్‌తో బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.అయితే తాజా అధ్యయనంలో గుడ్లు తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించలేదట. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.