Site icon HashtagU Telugu

Beautiful Skin: మెరిసే చర్మం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Beautiful Skin

Beautiful Skin

ఈ మధ్యకాలంలో స్త్రీలతో పాటు పురుషులు కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలను పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ తో పాటుగా హోమ్ రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. నిగనిగలాడే చర్మం కోసం ఇలా ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే అందర్నీ మరింత రెట్టింపు చేసుకోవడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ ని ఉపయోగించడంతో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. మరి ఇందుకోసం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వారంలో ఒక్కసారైన చేపలు కచ్చితంగా తినాలి. వారంలో రెండు మూడు సార్లు తిన్నా తప్పులేదు. ఎందుకంటే చేపల్లో ఒమేగా ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. ఇదే ఒమేగా ఆమ్లాలు బాదం పప్పులో, అవిశె గింజల్లో కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే పొట్టు తియ్య కుండా అమ్మె ధాన్యాలు అంటే పొట్టుతో ఉన్న గోధుమలు, పొట్టుతోనే ఉన్న పెసలు, బార్లీ లాంటి వాటితో ఏమైనా చేసుకుని తింటుండాలి. వీటిల్లో ఉండే పీచు పదార్థాలు చర్మం వడలిపోకుండా కాపాడి, బిగుతుగా ఉండేలా చేస్తుంది. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ తో వంటలు చేసుకుని తింటే మంచిది.

క్యాలీఫ్లవర్ కూర కూడా వారంలో ఒక రెండు రోజులు తినాలి. ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి6 హార్మోన్ లలో అసమతౌల్యం ఏర్పడకుండా కాపాడుతుంది. మొటిమలు రాకుండా చూస్తుంది. మరి ముఖ్యంగా తాజ పండ్లు రోజూ తినాలి. అరటిపండు, నారింజ, జామలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి.

Exit mobile version