Black Hair : రూపాయి ఖర్చు లేకుండా నెల రోజుల్లో జుట్టు పొడవుగా, నల్లగా పెరగాలంటే ఇలా చేయాల్సిందే?

పొడవాటి నల్లని, ఒత్తెన జుట్టు (Black Thick Hair) కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 07:00 PM IST

Black Thick and Long Hair Growing Tips : స్త్రీలు అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తారు కురుల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తారు. అంతేకాకుండా ఆడవారికి కురులు అందంగా కనిపించడంతోపాటు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో అనేక కారణాల వల్ల చాలామంది స్త్రీలు జుట్టు పెంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ హెయిర్ ఫాల్ చుండ్రు సమస్య కారణంగా చాలా వరకు జుట్టును పెంచుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఇక పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయిలను చూసి ఇంకొందరు అమ్మాయిలు ఈర్షగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పొడవాటి నల్లని, ఒత్తెన జుట్టు (Black Thick Hair) కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు.

అలా ఏవేవో ప్రోడక్ట్ లను ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడం సంగతి పక్కన పెడితే హెయిర్ ఫాల్ సమస్యలు చుండ్రు సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అయితే మీరు కూడా పొడవాటి ఒత్తైన జుట్టును కావాలని అనుకుంటున్నారా, అయితే ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఒక రెమెడీని పాటిస్తే చాలు. మీరు కోరుకునే జుట్టు మీ సొంతం అవుతుంది. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు కోసం ఉల్లిపాయని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రోడక్టులు కూడా ఉల్లిపాయ తో తయారు చేసినవి దొరుకుతున్నాయి. ఉల్లిపాయ జుట్టుకు సంబంధించిన సమస్యలను పోగొట్టడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయాన్నికొస్తే.. ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక లీటర్ వరకు నీటిని వేసుకొని ఈ నీటిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి. నీరు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకట్టుకొని ఏదైనా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి రసాన్ని తలకు ఇలా అప్లై చేయాలి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఉల్లిపాయల రసం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె, చుండ్రు ఉంటే కనుక ఐదు చుక్కల టేట్రే ఆయిల్ కలుపుకోవాలి. చుండ్రు లేకపోతే ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఆ తర్వాత తల వెంట్రుకలకు కూడా బాగా పట్టించి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపుతో హెయిర్ ని వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే హెయిర్ బలంగా దృఢంగా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రెమిడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే నల్లటి పొడవైన జుట్టును (Black Long hair) మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read:  Year in Search 2023: ఈ సంవత్సరం Googleలో అత్యధికంగా శోధించిన విషయాలు