వేసవికాలంలో ఎండల తీవ్రత పెరగడం, ఉష్ణోగ్రతలు భగ్గుమనడం వల్ల శరీరానికి చెమట పట్టడం సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాల్లో సరైన దుస్తులు ధరించకపోతే అసౌకర్యంతో పాటు డీహైడ్రేషన్, అలసట కూడా కలగవచ్చు. దీంతో వేసవిలో దుస్తుల ఎంపిక చాలా కీలకంగా మారుతుంది. నిపుణుల సూచనల మేరకు హాయి కలిగించే, శరీరానికి అనుకూలంగా ఉండే దుస్తులు ధరించాలి.
GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!
బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా కాటన్ లేదా లినెన్ బట్టలతో తయారైన లూజ్ ఫిటెడ్ దుస్తులను వేసుకోవాలి. ఇవి శరీరానికి గాలి వచ్చేలా చేస్తాయి. చెమట త్వరగా ఆరిపోయేలా సహాయపడతాయి. స్లీవ్‌లెస్ టాప్‌లు, కుర్తీలు, ఫ్లేర్ డ్రెస్సులు వంటి వాటిని వేసుకోవడం ఉత్తమం. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్‌లెస్ టీషర్ట్స్ వంటి వీలైన బట్టలను ధరించవచ్చు. వీటి ద్వారా తేలికగా ఊపిరి పీల్చుకోవచ్చు, శరీరం తేమగా ఉండకుండా ఉంటుంది.
అలాగే వేసవిలో రంగుల ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. ఎండలోకి వెళ్లేటప్పుడు లేత రంగుల దుస్తులు ధరించాలి. తెలుపు, పసుపు, లేత గులాబీ, స్కై బ్లూ వంటి కలర్స్ వేడిని పక్కన పెట్టి చల్లదనాన్ని కలిగిస్తాయి. బ్లాక్, డార్క్ బ్లూ, రెడ్ వంటి ముదురు రంగులు వేడి గ్రహించి శరీరాన్ని త్వరగా అలసటకు గురిచేస్తాయి. కాబట్టి వేసవిలో చల్లదనం కోసం ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని దుస్తులను ఎంచుకోవడం మంచిది.