పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజ చేకూరతాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమందికి ఉదయం పూట పాలు తాగే అలవాటు ఉంటే మరికొందరికి రాత్రి సమయంలో పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఒక్కొక్కరూ పాలని ఒక్కొక్క సమయంలో తాగుతూ ఉంటారు. కొందరు రాత్రి సమయంలో పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుందని తాగుతూ ఉంటారు. అయితే పాలను ఏ సమయంలో ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు ఉదయం సమయంలో కంటే రాత్రి సమయంలో తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రాత్రి సమయంలో పాలు తాగేటప్పుడు అందులో కొంచెం అశ్వగంధ పొడిని కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మంచి నిద్ర వస్తుంది. సాయంత్రం నుంచి రాత్రి పడుకునే వరకు మధ్య సమయాన్ని పాలు తాగడానికి సరైన సమయం గా చెప్పుకోవచ్చు. ఉదయం పూట పాలు తాగడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సేపు సమయం పడుతుంది. అలాగే ఎక్కువ శక్తిని కోల్పోయి నీరసం కూడా వస్తుంది. అలాగే ఉదయం సమయంలో వ్యాయామానికి ముందు పాలు తాగడం వల్ల జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే పాలతో కలిపి ఇతర పదార్థాలను తీసుకోకూడదు. మరి ముఖ్యంగా పాలతో కలిపి కొంతమంది స్నాక్స్ తింటూ ఉంటారు.
పాలతో కలిపి ఉప్పగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా కాపాడుకోవచ్చు. పాలలో ఉండే సెరోటోనిన్ మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు వేడి వేడి పాలు తాగడం మంచిది. చల్లగా ఉండే పాలను అసలు తీసుకోకూడదు. పాలు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది.