Site icon HashtagU Telugu

Green Dating Concept : గ్రీన్ డేటింగ్ అంటే ఏంటి..? మీ డేట్ ను మరింత రొమాంటిక్ గా ఇలా మార్చుకోండి..

What Is Green Dating Why It It Is Prevailing In India These Days Among Couples 1654676671 (1)

What Is Green Dating Why It It Is Prevailing In India These Days Among Couples 1654676671 (1)

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం మీద చాలా శ్రద్ధ పెరిగి పోయింది. అయితే ప్రేమికుల జంటలు కూడా పర్యావరణం పట్ల తమ ఇష్టాన్ని పెంచుకుంటున్నారు, ఇది నిజంగా అభినందనీయం. ఈ నేపథ్యంలో వినూత్నంగా ప్రేమికుల జంటలు గ్రీన్ డేటింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. విదేశాల్లోనే కాదు అటు మనదేశంలో కూడా ఈ ధోరణిని అనుసరిస్తున్నారు. మరి గ్రీన్ డేటింగ్ గురించి తెలుసుకుందాం…

గ్రీన్ డేటింగ్ అంటే ఏమిటి?
జంటలు డేట్‌లకు వెళ్లడం, ఒకరికొకరు బహుమతులు ఇవ్వడం, క్యాజువల్ ఔటింగ్‌లకు వెళ్లడం సర్వసాధారణం. ఇది గ్రీన్ డేటింగ్ లో మీ రిలేషన్‌షిప్‌లో కొత్తదనాన్ని తీసుకురావాలనే ఆసక్తి ఉంటే, మీరు కూడా పర్యావరణ అనుకూలమైన డేటింగ్ చేయడం ద్వారా మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించవచ్చు.

>> రిలేషన్ షిప్ లో ఒకరికొకరు బహుమతులు లేదా సర్ ప్రైజ్ లు ఇవ్వడం సర్వసాధారణం. మీరు ఎకో-ఫ్రెండ్లీ డేటింగ్ చేయాలనుకుంటే, పర్యావరణానికి కూడా మేలు చేసే బహుమతులను వారికి అందించవచ్చు. ఉదాహరణకు, రీ యూజబుల్ కాఫీ మగ్‌లు, జనపనార, లేదా చేనేతతో చేసిన బ్యాగ్‌లు, ఇండోర్ ప్లాంట్లు వంటి వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు. తద్వారా మీ భాగస్వామి దానిని మరింత ఇష్టపడతారు.

>> కొన్నిసార్లు రెస్టారెంట్ లేదా కేఫ్‌లో గడిపే బదులు, చిన్న పిక్నిక్‌ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా పార్కుకు వెళ్లవచ్చు. అక్కడే రుచికరమైన ఆహారం ఎంజాయ్ చేయవచ్చు. పిక్నిక్‌లో బయో-డిగ్రేడబుల్ కప్పులు. ప్లేట్‌లను ఉపయోగించవచ్చు.

>> జంటలు తరచుగా బైక్‌లు లేదా కార్లలో లాంగ్ డ్రైవ్‌లకు వెళతారు. కానీ గ్రీన్ డేటింగ్ లో సైక్లింగ్‌ ద్వారా మీ పిక్నిక్ స్పాట్ కు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీరిద్దరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలాగే పర్యావరణం కోసం చిన్న ప్రయత్నం చేయగలుగుతారు.

>> మీ సమీపంలో ఉన్న నర్సరీలకు వెళ్లి మొక్కలను కొని మీ ప్రియురాలికి చక్కటి గిఫ్ట్ ఇవ్వచ్చు. అలాగే ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా విహార యాత్రలకు వెళ్లవచ్చు. ఇలా మీ డేట్ ను పచ్చదనంతో మరింత రొమాంటిక్ గా మార్చుకోవచ్చు..