Sugar: చక్కెర తింటేనే కాదండోయ్.. తినకపోయినా కూడా సమస్యనే.. ఎలా అంటే?

సాధారణంగా చాలామంది చక్కెర పదార్థాలను తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడి తింటూఉంటారు. ఇంకొందరు

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 07:00 AM IST

సాధారణంగా చాలామంది చక్కెర పదార్థాలను తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడి తింటూఉంటారు. ఇంకొందరు అయితే తీపి పదార్థాలను అస్సలు ఇష్టపడరు. తీపి అంటే ఇష్టపడని వారు టీ కాఫీలకు కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే అందులో ఉండే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని వాటికి దూరంగా ఉంటారు. అయితే చక్కెరను అధికంగా తినడం వల్ల డయాబెటిస్ తో పాటు అనేక రకాల సమస్యలు వస్తాయి. అసాధారణంగా చాలామంది చక్కెర పదార్థాలను తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడి తింటూఉంటారు. ఇంకొందరులా అని చాలామంది చక్కెరను తినడం మానేస్తూ ఉంటారు. అటువంటి వారు ఇంకా ప్రమాదంలో పడతారు. ఎందుకంటే చక్కెరను తినడం ఎంత ప్రమాదమో చక్కెరను పూర్తిగా తినకపోవడం కూడా అంతే ప్రమాదం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చక్కెరను తీసుకోవడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. అంతేకాకుండా చక్కెరను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సాధారణంగా చక్కెర తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతూ ఉంటారు.. ఎందుకంటే అధికంగా చక్కెర తినడం వల్ల అధిక రక్తపోటు,బరువు పెరగడం, మధుమేహం, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల మొటిమలు రావడంతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది. మరి చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చక్కెరను తినడం మానేస్తే శరీరంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా మనసు ఒత్తిడికి లోనవుతుంది.

మూడ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. చక్కెర తిని అలవాటులను తగ్గించుకున్నప్పుడు మీరు ఒక్కసారిగా బరువు తగ్గుతారు. కాబట్టి చక్కెరను ఒక్కసారిగా తినడం మానేస్తే బరువు తగ్గడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి చక్కెరను మానేయాలి అనుకున్నవారు అందుకు ప్రత్యామ్నాయంగా ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదే.. అనగా బెల్లం, తేనె,కొబ్బెర వంటివి తీసుకోవచ్చు.