Stop Urine: మళ్ళీ పోదాంలే అని అవి ఆపుతున్నారా? అయితే మీకు రోగాలు రావొచ్చు!

సాధారణంగా కొంతమంది ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు లేదంటే నలుగురిలో ఉన్నప్పుడు మూత్ర విసర్జనను

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 08:30 AM IST

సాధారణంగా కొంతమంది ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు లేదంటే నలుగురిలో ఉన్నప్పుడు మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటారు. అయితే చాలామంది మూత్ర విసర్జన కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఇలా మూత్ర విసర్జన ను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. సాధారణంగా మూత్ర విసర్జనను ఆపే సామర్థ్యం ఆ వ్యక్తి ఒక వయసు పై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా వయోజన మూత్రపిండాలు 2 కప్పుల మూత్రాన్ని నిలిపి ఉంచగలవు. కానీ పిల్లల్లో మూత్రాన్ని నిల్వ చేసే సామర్థ్యం దానిలో సగం మాత్రమే ఉంటుంది. అందుకే పిల్లలు తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. కాగా మూత్ర విసర్జనను ఆపడానికి ప్రయత్నించినప్పుడు మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకటి లేదా రెండుసార్లు మూత్రవిసర్జనను ఆపివేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ క్రమం తప్పకుండా అలాగే మూత్రాన్ని ఆపివేయడం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైనా మూత్రశయ సామర్థ్యం కంటే ఎక్కువగా మూత్రాన్ని ఆపడం వల్ల యూటీఐ సంక్రమణ కు దారితీస్తుంది.

కాగా వాస్తవానికి మూత్రంలో శరీరంలోని అనేక పనికిరాని బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి సకాలంలో దానిని తొలగించనప్పుడు దాని పరిమాణం మరింత పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ లు వస్తాయి. దీనివల్ల మూత్ర విసర్జన సమయంలో వివరీతమైన మంట కలుగుతుంది. అయితే ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్ర గోడలు బలహీనపడుతాయి. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే మూత్రాశయం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్రమంగా అది మూత్ర లీకేజీ కి కదారితీస్తుంది.