Site icon HashtagU Telugu

Bath and Dream: స్నానం చేస్తున్నట్టు కల వస్తే ఏం జరుగుతుంది.. సంకేతం ఏంటీ?

Bath

Bath

సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు కలలు వస్తుంటాయి. కొంతమంది పగటిపూటి కలలు వస్తే మరి కొంతమందికి రాత్రి సమయంలో కలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కల లలో కూడా అనేక రకాలు కలలు వస్తూ ఉంటాయి. కొన్ని భయంకరమైన కలలు,కొన్ని ప్రశాంతమైన కలలు, మరికొన్ని మనసుకు ఆహ్లాదం కలిగించే కలలు ఇలా చిత్ర విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి పీడకలలు భయంకరమైన కలలు వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. అటువంటిది జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు.

అయితే మనకు వచ్చే కలలు ఒక్కొక్క సంకేతాన్ని సూచిస్తాయని, అలాగే ఒక్కొక్క కలకు ఒక్కో ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమందికి కలలో స్నానం చేసినట్లుగా, లేదంటే దంపతులు కలిసి స్నానం చేసినట్టుగా కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇలా స్నానం చేస్తున్నట్టుగా వచ్చే కలలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంచినీటితో స్నానం చేస్తున్నట్టుగా కలలు వస్తే త్వరలోనే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం.

అదేవిధంగా అప్పటివరకు ఉన్న అనారోగ్య సమస్యలు వదిలి ఆరోగ్యవంతంగా మారతారని కూడా అర్థం. అదేవిధంగా కలలో కాళ్లు కడుక్కునట్టుగా వస్తే త్వరలోనే కష్టాల నుంచి గట్టెక్కబోతున్నారని అర్థం. అలా కాకుండా మురికి నీటితో స్నానం చేస్తున్నట్టు కల వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుబడులు చేసేవారు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది.