Jaundice Diet: కామెర్లు వస్తే ఏయే ఫుడ్స్ తినాలి ? ఏయే ఫుడ్స్ తినొద్దు?

అప్పుడే పుట్టిన శిశువు (Baby) నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వచ్చే వ్యాధి పచ్చ కామెర్లు!! చర్మం,

అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వచ్చే వ్యాధి పచ్చ కామెర్లు (Jaundice)!! చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగులోకి మారడమే ఈ వ్యాధికి గుర్తులు. మన రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం అధికంగా చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ పోయాక మిగిలిపోయే భాగమే. బైలిరుబిన్. బైలిరుబిన్ మోతాదు ఎక్కువైన ప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది. అయితే ఈ బైలిరుబిన్ సమస్యను కాలేయం తగ్గిస్తుంది.

కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా కాలేయ పనితీరు దెబ్బతింటుంది. బైలిరుబిన్ రక్త స్థాయిలు ప్రతి డెసిలీటర్ కు 2 నుండి 3 మిల్లీగ్రాములు (mg/dL) లేదా అంతకంటే ఎక్కువ ఉండటం వలన లక్షణాలు బయటికి కనిపిస్తాయి.  కామెర్ల వల్ల జ్వరం, అలసట, బలహీనత వస్తాయి. కామెర్లు వచ్చినప్పుడు ఏ ఫుడ్స్ తినాలి ? ఏ ఫుడ్స్ తినొద్దు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కామెర్లు (Jaundice) ఇలా వస్తాయి?

వాస్త‌వానికి కామెర్లు అంటే ఒక వ్యాధి కాదు. ఇది స‌మ‌స్య రూపం మాత్ర‌మే. కాలేయంలో ర‌క్త క‌ణాల్లోని ఎర్ర ర‌క్త క‌ణాల విచ్చిన్నం జ‌రుగుతుంది. దీని కార‌ణంగా బైలి రూబిన్ అనే వ‌ర్ణ‌కం రూపొంది, పేగుల్లోకి వెళుతుంది. ఏదైనా కార‌ణాల‌తో ఈ బైలిరూబిన్ కాలేయంలోనే పోగు ప‌డితే దాన్ని కామెర్లుగా అభివ‌ర్ణిస్తారు. ఇందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి. వైర‌స్ ఇన్ ఫెక్ష‌న్ కావ‌చ్చు, స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం కావ‌చ్చు, దుర‌ల‌వాట్లు కావ‌చ్చు.. కానీ కామెర్ల కు కార‌ణం తెలిసినప్పుడే అది ఎటువంటి ర‌క‌మో అర్థం అవుతుంది. అప్పుడే దీనికి చికిత్స చేయ‌టం సులువు అవుతుంది.
ఈ కామెర్లు (Jaundice) కార‌ణంగా శ‌రీరంలోని అనేక భాగాలు ప‌చ్చ‌గా మార‌తాయి. అందులో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్ల ద‌గ్గ‌ర ఉండే తెల్ల పాప ప‌చ్చ‌గా మారుతుంది. చాలా సార్లు ఇటువంటి ల‌క్ష‌ణాల్ని బ‌ట్టే కామెర్లును గుర్తిస్తారు. అంత మాత్రం చేత ఆ వ్య‌క్తి చూసే దృశ్యం బాగానే ఉంటుంది. కంటి చూపు ద్వారా ప‌చ్చ‌గా క‌నిపించ‌టం ఉండ‌దు. ఇది వ్యంగం కోసం పుట్టిన సామెత త‌ప్ప‌, ఆరోగ్య ప‌రంగా ప్రాధాన్యం లేదు. అందుచేత వ్యంగంగా వ్యాఖ్యానించ‌టానికి మాత్రం దీన్ని వాడుకోవ‌చ్చు. కామెర్ల గురించి అవ‌గాహ‌న ఉంటే స‌క్ర‌మంగా చికిత్స తీసుకోవ‌టానికి వీల‌వుతుంది. చుట్టుపక్క‌ల వారికి కామెర్లు ఉంటే అప్ర‌మ‌త్తం చేయ‌టానికి వీల‌వుతుంది.

తినాల్సిన ఫుడ్స్

తృణధాన్యాలు: గోధుమలు, మిల్లెట్లు, బుక్వీట్, ఓట్స్, బియ్యం , క్వినోవా వంటి తృణధాన్యాలు తినడం వల్ల కామెర్ల నుంచి త్వరగా కోలుకోవచ్చు. గంజి, కిచ్డీ, పాన్‌కేక్‌లు, చపాతీ, దోశ రూపంలో
తృణధాన్యాలు తినండి.

గింజలు: నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, బాదం, పిస్తా, హాజెల్‌నట్‌లు, వాల్‌నట్‌లు వంటి అన్ని గింజలు ప్రయోజన కరంగా ఉంటాయి. వాల్‌ నట్స్‌లో అర్జినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ ప్రక్షాళనకు మద్దతు ఇస్తుంది.

పండ్లు మరియు కూరగాయలు: పండ్లు మరియు కూరగాయలలో విటమిన్లు A (బీటా-కెరోటిన్), C మరియు E, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ , ఫోలిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కాలేయ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరం బయటపడటానికి సహాయపడతాయి.

బీన్స్, పప్పులు: రాజ్మా, బఠానీలు, కాయ ధాన్యాలు , వేరుశెనగలతో సహా పప్పు ధాన్యాలు, బీన్స్ తీసుకోవచ్చు. కుల్తీ బీన్స్, నల్ల మినుములు కాలేయానికి అనుకూలమైన ఆహారాలు. ఇవి కామెర్ల నుంచి కోలుకునేలా చేస్తాయి.

మూలికలు, సుగంధ ద్రవ్యాలు: మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఆహారానికి రుచిని జోడిస్తాయి. అవి కామెర్ల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది కాలేయాన్ని ఫ్యూరిఫై చేస్తుంది.

ఈ జ్యూస్ లు బెస్ట్

  1. ముల్లంగి రసం
  2. క్యారెట్ రసం
  3. బీట్‌రూట్ రసం
  4. చెరకు రసం
  5. నిమ్మరసం

ఈ ఫుడ్స్ తినొద్దు

ఉప్పు ,ప్యాక్ చేసిన ఫుడ్: ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన ఆహార పదార్ధాలలో ప్రిజర్వేటివ్స్ వాడుతారు.ఆ ఫుడ్ ప్యాక్స్ ఎక్కువ రోజులు షెల్ఫ్ లో ఉండేందుకు.. వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి దెబ్బతిన్న కాలేయాన్ని సులభంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటిని ముట్టుకోవద్దు. ఫ్రోజెన్ మాంసాలు, వైట్ బ్రెడ్, పొరలు, పాస్తా తినొద్దు.

వేయించిన ఫుడ్స్ & కొవ్వు పదార్ధాలు: వేయించిన ఆహారాలలో నూనె, సంతృప్త (చెడు) కొవ్వులు ఉంటాయి. వీటిని తింటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, అది మరింత బలహీనంగా తయారవుతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ప్రాసెస్ చేసిన జున్ను, క్రీమ్‌లు, ఫ్రైలు, చిప్స్, డెజర్ట్‌లు కూడా తినొద్దు.

పచ్చి, వండని ఆహారాలు: పచ్చి మరియు వండని ఫుడ్ తినొద్దు. ఇది కాలేయాన్ని సులభంగా దెబ్బతీస్తుంది.

మద్యం: కామెర్లు కాలేయాన్ని బలహీనపరుస్తాయి. కాలేయంపై ఆల్కహాల్ ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్‌లో ఉండే విషపూరిత రసాయనాల కారణంగా కామెర్లు వచ్చిన వాళ్లలో కాలేయ భాగంలో మంట వస్తుంది. కాలేయ సిర్రోసిస్‌కు కూడా దారి తీస్తుంది.

Also Read:  Coimbatore: కోయంబత్తూరులో మహిళను తొక్కి చంపిన అడవి ఏనుగు !