Site icon HashtagU Telugu

Hair Tips: జుట్టు బలంగా పెరిగి బట్టతల రాకూడదంటే వీటిని తినాల్సిందే!

Hair Tips

Hair Tips

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పలుచని జుట్టు కారణంగా చాలామంది నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫలితం జుట్టు కారణంగా అమ్మాయిలలో కూడా బట్టతల సమస్య రావడం ఈమధ్య కాలంలో మొదలవుతోంది. అబ్బాయిలు కూడా పలుచని జుట్టు కారణంగా చిన్న వయసుకే బట్టదల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇక జుట్టు పెరగడం కోసం ఏవేవో షాంపూలు హెయిర్ ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీస్.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి తో జుట్టుకి అవసరమయ్యే సిలికా అనే పోషకం కూడా ఇందులో ఉంటుంది. అలాగే కోడిగుడ్లు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలో బయోటిన్, ప్రొటీన్, కోలిన్, ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ బి12, లు టెయిన్, జియక్సన్‌తిన్, యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలే జుట్టును బలంగా చేస్తాయట. అలాగే తరచుగా మీ డైట్ లో భాగంగా క్యారెట్ ను చేర్చుకోవడం మంచిది. క్యారెట్లలో ఉండే వైటనింగ్ ఏ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందట. అలాగే డ్రై ఫ్రూట్స్ పల్లీలు కాజు బాదం అవిస గింజలు వంటివి కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఏ జుట్టుకు ఎంతో మేలు చేస్తుందట.

ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫొలేట్, ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఉండడం వల్ల జుట్టు ధృడంగా మారుతుందట. డార్క్ చాక్లెట్లతో కూడా జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చట. పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం కూడా ఉండడం వల్ల జుట్టు వత్తుగా బలంగా మారుతుందట. బ్లూబెర్రీస్‌ లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును చుండ్రు వల్ల వచ్చే నష్టాన్ని నివారిస్తుందట. అదేవిధంగా చిలగడదుంపల్లో ఉండే వైటమిన్ కె, బీటా కెరోటిన్ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుందట. చుండ్రు ఇతర ఇన్‌ఫెక్షన్లు రాకుండా కూడా చేస్తుందని చెబుతున్నారు.