చాలామంది టీవీ (TV) చూస్తూ భోజనం (Eating ) చేస్తుంటారు..కానీ ఇలా చేయడం వల్ల మీరు మీరు అనారోగ్యాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే అని వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం జనాలంతా బిజీ లైఫ్ కు అలవాటుపడ్డారు. ఎంతసేపు డబ్బు సంపాదన మీద పడి జనాలు టైంకు ఆహారం తినకపోవడం , రోడ్ సైడ్ ఫుడ్ కు అలవాటు పడడం, ఒకవేళ ఇంట్లో భోజనం చేసినప్పటికీ..ఏదో హడావిడిగా , టీవీ చూస్తూ తింటున్నారు. కానీ ఇలా తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతారు.
తాజాగా న్యూట్రిషనిస్ట్ అపూర్వ అగర్వాల్ మాట్లాడుతూ..టీవీ చూస్తూ తినడం వల్ల ఎలాంటి ప్రమాదమో తెలియజేసింది. టీవీ చూస్తూ తినడం వల్ల మనం ఏమి తింటున్నామో ధ్యాస ఉండదు..ఫుడ్ టెస్ట్ కూడా మనకు తెలియదు.. ఆకలి, సంపూర్ణత సంకేతాలపై శ్రద్ధ చూపే అవకాశం తక్కువ గా ఉంటుంది. దీనివల్ల తృప్తి స్థాయికి మించి తినేస్తారు. ఫలితంగా బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇక జంక్ ఫుడ్ తీసుకోవడం, సంతృప్తి పై అవగాహన తగ్గిపోవడం, టీవీ చూడటం వల్ల శారీరక శ్రమ తగ్గడం, కాలక్రమేణా బరువు పెరగడానికి దారి తీస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆహారం తినే ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రస్తుత క్షణంపై ఫోకస్ చేయడానికి దోహదపడుతుంది. తినే ముందు ఆహారం రంగులు, వాసనలు గమనించాలి. ఇది తినడంపై ఇంద్రియాలను దృష్టి సారించేలా చేస్తుంది. ఆహారం రుచి ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమిలి, మింగాలి అని తెలియజేసారు. టీవీ ముందు ఎంత సమయం గడుపుతున్నారు గమనించుకోవాలి అని అపూర్వ అగర్వాల్ తెలియజేసారు.
Read Also : Hibiscus : ‘మందార మొక్క’ కూడా ఆర్ధిక సమస్యల నుండి బయటపడేస్తుందని మీకు తెలుసా..?