Site icon HashtagU Telugu

Honey: కాలిన గాయాలు మొటిమలు మాయం అవ్వాలంటే తేనెతో ఈ విధంగా చేయాల్సిందే!

Honey

Honey

తేనే వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తేనే తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే తేనెను చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఈ తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సౌందర్య పరిరక్షణ కోసం కూడా తేనెను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా గాయాలు, మచ్చలను తగ్గించడంలో బాగా సహాయ పడుతుందట. కాలిన గాయాల పైన తేనెను రాయడం వల్ల మచ్చలు పడవని చెబుతున్నారు.

మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయని చెబుతున్నారు. పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయట. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగు పడి, పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు. కాఫీ, టీ, జ్యూస్, స్వీట్స్, సలాడ్స్‌లో చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించవచ్చట. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే తేనె చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుందట. ఇది చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుందని చెబుతున్నారు. తేనె పూయడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయట. అలాగే తేనె జుట్టుకు సహజ కండిషనర్‌ గా ఉపయోగపడుతుందట.

తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందట. తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని చెబుతున్నారు. మీ మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా ఉంటే కాస్తే తేనెను పూయడం వల్ల ఈ నలుపు తగ్గి మృదువుగా మారుతుందట. రోజూ తేనెను తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరిగి చర్మం కాంతివంతంగా అవుతుందని చెబుతున్నారు. రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ముందు ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఫలితంగా ఇది మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు.