Lice: తలలో పేను ఎక్కువగా ఉందా.. అయితే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?

మామూలుగా స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామందికి తలలో పేను సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరు అయితే ఈ పేన్ల కారణంగా తల

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 05:00 PM IST

మామూలుగా స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామందికి తలలో పేను సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరు అయితే ఈ పేన్ల కారణంగా తలను పిచ్చి పట్టిన వారిలా రెండు చేతులతో గోక్కుంటూ ఉంటారు. తలలో ఉండే ఈ పేలు తలోని రక్తాన్ని పీలుస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టి పెరుగుతుంటాయి. దీంతో అవి తలలో ఉన్నంతసేపు దురదగానే ఉంటుంది. ఇవి ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ ఎక్కువగా ఉండడం వల్ల దురదగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తల వెంట్రుకలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పిప్పరమెంట్ ఆయిల్… ఇందులోని గొప్ప గుణాలు పేలని దూరం చేయడంలో సాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో పిప్పరమెంట్ ఆయిల్ మిక్స్ చేసి తలకి రాయాలి. బాగా మసాజ్ చేసి వెడల్పాటి దువ్వెనతో దువ్వాలి. ఆపై అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చాలు పేను సమస్య తగ్గ ముఖం పడుతుంది. అలాగే వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొద్దిగా నూనెలో కలిపి రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ కూడా పేలని దూరం చేయడంలో బాగా పనిచేస్తుంది. దీనిని రాయడం వల్ల తలలోని పేలు చాలా వరకూ దూరమవుతాయి. మయోన్నైస్ పేలని చంపుతుంది. పేను వల్ల కలిగే దురదని, చికాకుని దూరం చేస్తుంది. దీనిని కుదుళ్ళకి ప్యాక్‌లా రాయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

అయితే, ప్లెయిన్ మయోన్నైస్ తీసుకోవాలి. కొబ్బరినూనెలో పేనులో కొద్దిగా సోంపు ఆయిల్ కలిపి రాయాలి. ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్‌గా పేలని దూరం చేస్తుంది. సోంపు ఆయిల్ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రాయడం వల్ల తలలో ఉండే చుండ్రు, పేలు, చికాకు దూరమవుతుంది. రెగ్యులర్‌గా దీనిని అప్లై చేయడం మంచిది. బేకింగ్ సోడా కూడా పేలను ఎఫెక్టివ్‌గా చంపుతుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి ప్యాక్‌లా వేయండి. అయితే, కళ్ళకి దూరంగా ఉండేలా చూసుకోండి. అదే విధంగా.. చెక్క దువ్వెనల్ని 5 నుంచి 10 నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టి గట్టిగా దువ్వండి. దీని వల్ల పేలు చాలా వరకూ చనిపోతాయి.