Site icon HashtagU Telugu

Peanuts For Beauty: పల్లీలు కేవలం ఆరోగ్యానికి కాదండోయ్.. అందానికి కూడా.. ఎలా ఉంటే?

Peanuts For Beauty

Peanuts For Beauty

మామూలుగా ప్రతి ఒక్కరి వంటగదిలో పల్లీలు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. పల్లీలను చాలా రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వీటిని ఉపయోగించి కొన్నిరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పల్లీలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.. వేరుశనగలో కార్బోహైడ్రేట్స్‌, ఫైబర్‌, ప్రొటిన్లు, విటమిన్‌ సి, ఎ, బి6 ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

పల్లీలు మన ఆరోగ్యానికే కాకుండా అందాన్ని రెట్టింపు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేరుశనగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో చర్మానికి అవసరమైన విటమిన్‌ ఇ, నియాసిన్, జింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వేరుశనగలోని విటమిన్‌ ఇ యాంటీ ఆక్సిడెంట్‌ లా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్యాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. చర్మంపై ముడతలు, గీతలను నివారిస్తుంది. అంతే కాకుండా వేరుశనగలోని విటమిన్‌ ఇ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది యూవీ కిరణాల హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. పల్లీలలోని విటమిన్‌ బి6 యూవి కిరణాలు, కాలుష్యం కూడా నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

వేరుశెనగలో ఉండే విటమిన్ కె, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డార్క్‌ సర్కిల్స్‌ తగ్గిస్తాయి. కంటి వలయాలు రాకుండా రక్షిస్తాయి. పల్లీలలోని నియాసిన్‌ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను, కళ్ల ఉబ్బరాన్ని కూడా నివారిస్తుంది. వేరుశనగలో జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొల్లాజెన్ చర్మానికి అవసరం. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలును నివారిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణాలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కాలక్రమేణా చర్మం ముడతలు లేకుండా చేస్తుంది. వేరుశెనగలో ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. పిల్లీలలోని విటమిన్‌ సీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, స్కిన్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. పల్లీలలోని నూనె.. చర్మానికి పోషణ అందించి.. మృదువుగా, మెరిసేలా చేస్తుంది. వేరుశెనగలోని విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి.