Oil Tips : వామ్మో.. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ ఉపయోగిస్తే అంత డేంజరా?

కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను (Cooking Oil) మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉంటాం.

  • Written By:
  • Updated On - December 16, 2023 / 12:22 PM IST

Tips of using Cooking Oil : ఈ రోజుల్లో మనుషులు బయట ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ అంటే చాలు లొట్టలు వేసుకొని మరీ తినేస్తూ ఉంటారు. అయితే బయట మీరు చాలా వరకు గమనిస్తే ఉపయోగించిన నూనె (Oil) మళ్ళీ మళ్ళీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కబాబ్, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలకు ఎక్కువగా ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను (Cooking Oil) మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.

We’re now on WhatsApp. Click to Join.

అలా చేయడం ప్రాణాలకే ప్రమాదం. ఎక్కువసార్లు వాడిన నూనెను మళ్ళీ వాడితే ఫ్రీ రాడికల్స్ ను పెంచుతూ ఉంటాయి. ఇవి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి. వీటి వలన బ్లాక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాడిన నూనెను తిరిగి వాడితే ఆహారం విషంగా మారుతుంది. దాంతో కడుపులో మంట, కడుపులో నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకసారి వాడిని మళ్లీమళ్లీ వాడడం అస్సలు మంచిది కాదు. నూనెను ఒకసారి వినియోగిస్తే దానిలోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే తిరిగి ఆ నూనెను వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్ గా తయారవుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు.

ఒకసారి వాడిన నూనెతో తయారుచే సిన ఆహర పదార్థాలు తీసుకోవడం వలన గుండె జబ్బులే కాకుండా అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందట. బయట దొరికే ప్రాసెస్ ఫుడ్ ని కూడా తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే బయట ప్రతిరోజు అదే ఆయిల్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉపయోగించే ఆయిల్ తో పోల్చుకుంటే బయట ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి బయట దొరికే జంక్ ఫుడ్స్ ని ఆయిల్ ఫుడ్స్ ని తినడం చాలా వరకు తగ్గించడం మేలు.

Also Read:  Coconut Tips : లేత కొబ్బరితో మెరిసిపోయే అందాన్ని మీ సొంతం చేసుకోండిలా?