Weightloss Laddu: బరువును తగ్గించే లడ్డూలు.. రోజుకొక్కటి తినండి చాలు

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని చిన్న మంట మీద నువ్వుల్ని వేయించాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. ఖర్జూరాలను, మిగతా గింజల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి.

  • Written By:
  • Updated On - December 28, 2023 / 07:24 PM IST

Weightloss Laddu: బరువు తగ్గేందుకు చాలా ట్రై చేస్తుంటారు. స్వీట్స్, ఇష్టమైన ఫుడ్ తినకుండా చాలా కంట్రోల్డ్ గా ఉండాలి. కానీ ఈ లడ్డూలు బరువును తగ్గిస్తాయి. దీనితోపాటు వ్యాయామం కూడా చేయాలి. పోషక ఆహారం, కొవ్వులేని ఆహారాన్ని తినడం ద్వారా బరువు తగ్గొచ్చు. మరి ఆ బరువును తగ్గించే లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బరువు తగ్గించే లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు

అవిసెగింజలు – 1/4 కప్పు
నువ్వులు – 1 కప్పు
జీడిపప్పు తరుగు – 3 స్పూన్లు
సోంపు గింజలు – 1 స్పూన్
యాలకుల పొడి – 1/2 స్పూన్
పల్లీలు – గుప్పెడు
బెల్లం తురుము – 1/4 కప్పు
ఖర్జూరాలు – 1 కప్పు
బాదం తరుగు – 3 స్పూన్లు
గుమ్మడి గింజలు – 2 స్పూన్లు
పిస్తా తరుగు – 2 స్పూన్లు

లడ్డూల తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని చిన్న మంట మీద నువ్వుల్ని వేయించాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. ఖర్జూరాలను, మిగతా గింజల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి.

ఇప్పుడు బెల్లం తరుగు, ఖర్జూర పండ్లను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని.. వేయించి పక్కనపెట్టుకున్న నట్స్ అన్నింటినీ కలుపుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న ముద్దను చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటిపై ఎండుకొబ్బరి పొడి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.

ఈ లడ్డూలను గాలి తగలకుండా ఒక జార్ లో వేసి నిల్వ చేసుకోవచ్చు. వారంరోజులపాటు తాజాగా ఉంటాయి. రోజుకొక లడ్డూ తింటే.. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఆకలి తక్కువగా ఉంటుంది. కానీ.. రోజూ ఒక సమయంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.