Site icon HashtagU Telugu

Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ చపాతీలకు బదులుగా ఈ రోటీలు తినండి..!!

Water Chest Nuts

Water Chest Nuts

చాలా మంది బరువు తగ్గాలని గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోధుమ పిండికి బదులుగా వాటర్ చెస్ట్ నట్ పిండిని ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు. ఈ పిండిలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఇందులో లబిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులను ఉపశమనం పొందవచ్చు.

వాటర్ చెస్ట్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. వాటర్ చెస్ట్ నట్స్ లో కార్బొహైడ్రెట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీనితో తయారు చేసిన పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో బలహీనతను దూరం చేసి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. వాటర్ చెస్ట్ నట్ పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో బరువును నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. గోధుమలకు బదులుగా ఈ పిండిని రోటిలకు వాడండి. ఈజీగా బరువు తగ్గుతారు.

2.  ఈ పిండి ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఈ పిండిలో అధిక రక్తపోటులో ఉపశమనాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

3. వాటర్ చెస్ట్ నట్ మీ చర్మం, జుట్టుకు కూడా చాలా మంచిది. శరీరానికి సహాజమైన డిటాక్స్ గా పనిచేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జట్టును బలంగా ఉంచుతుది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

Exit mobile version