Site icon HashtagU Telugu

Contact Lens Tips: కంటికి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Wearing Contact Lens In The Eye These Precautions Are Mandatory

Wearing Contact Lens In The Eye These Precautions Are Mandatory

అమెరికాలో నివసించే 21 ఏళ్ల మైఖేల్ మరిచిపోయి కాంటాక్ట్ లెన్స్‌లతో (Contact Lens) నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఒక కంటి చూపు పోయింది. మైక్ కన్నును ఫ్లాష్ అనే పరాన్న జీవి తినేసింది. దీని వలన అతను దృష్టిని కోల్పోయాడు. మైక్ యొక్క చిన్న అజాగ్రత్త అతనిని చాలా నష్ట పరిచింది. అందుచేత కాంటాక్ట్ లెన్స్ (Contact Lens) వాడే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

కాంటాక్ట్ లెన్సులు (Contact Lens) అంటే..

కంప్యూటర్లు, మొబైల్స్ వాడకం పెరిగింది. దీంతో ఎంతోమందికి కంటిచూపు (Eyesight) మందగిస్తోంది. చాలా మంది చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. కళ్లద్దాలు తరచుగా వాడుతుంటే.. ముఖంపై మచ్చలు ఏర్పదుతున్నాయి. అందుకే ప్రజలు కొన్నిసార్లు కళ్లద్దాల బదులు కాంటాక్ట్ లెన్సులు ధరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు అవసరం

  1. ఎక్కువ కాలం కాంటాక్ట్ లెన్స్‌లు ధరించవద్దు. ఉపయోగించిన వెంటనే వాటిని తీసేసి కళ్లను శుభ్రం చేసుకోవాలి.
  2. కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తే తప్పకుండా నిద్రపోయే ముందు వాటిని తీసేయాలి. అలాగే నిద్రపోతే కళ్లలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది.
  3. లెన్స్ మీ కళ్లకు సరిపోతుందో లేదో ఎప్పటికప్పుడు కంటి డాక్టర్ ద్వారా చెక్ చేసుకోండి.
  4. లెన్స్‌ల గడువు తేదీ గురించి జాగ్రత్తగా ఉండండి. గడువు ముగిసిన లెన్స్‌లు ఎప్పుడూ హానికరమే.
  5. కాంటాక్ట్ లెన్స్‌లు శుభ్రం చేస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీని కోసం లెన్స్‌లను వేడి చేసి చల్లార్చిన నీటితో క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. లెన్స్‌లను శుభ్రం చేసేముందు, వాడే ముందు మీ చేతులను బాగా కడగాలి.
  6. లెన్స్‌ను కంటిలో పెట్టేటప్పుడు పొరపాటున నేలపై పడితే, అలాగే కంటిలో పెట్టవద్దు. ఎందుకంటే నేలపై పడటం ద్వారా అనేక రకాల క్రిములు అందులోకి చేరి కంటి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
  7. ఈత కొట్టేటప్పుడు, కంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు, మంటల చుట్టూ ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించకూడదు.
  8. రైడింగ్ చేసేటప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించినట్లయితే సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు.
  9. లెన్స్‌ను కంటిలో పెట్టే ముందు, ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ ద్రావణంతో శుభ్రం చేయండి.
  10. లెన్స్‌లు వేసుకున్న తర్వాత మీకు మంట లేదా మరేదైనా సమస్య అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read:  Mukesh Ambani: మరో రంగంలోకి ముఖేష్ అంబానీ గ్రాండ్ ఎంట్రీ